1
00:01:27,629 --> 00:01:29,131
సిల్వేయిన్

2
00:02:15,886 --> 00:02:19,264
దేవుడా, ఎలా ఉన్నావో చూడు. లోపలికి రా.

3
00:02:22,976 --> 00:02:24,311
ఎలా ఉన్నావు, బామ్మ?

4
00:02:25,103 --> 00:02:26,647
ఏదో బతికే ఉన్నాలే.

5
00:02:27,231 --> 00:02:29,316
నువ్వు ముందే వస్తావనుకున్నా.

6
00:02:29,399 --> 00:02:31,610
బస్సు ఆలస్యమైంది.

7
00:02:32,361 --> 00:02:36,490
ఊరికి వచ్చి నేనే ఎక్కించుకొని వచ్చేదాన్ని,
కానీ నేను బండి నడపకూడదని చెప్పారు.

8
00:02:38,492 --> 00:02:40,118
నీ గదిని సర్ది ఉంచాను.

9
00:02:40,869 --> 00:02:42,871
అరలో కొన్ని బట్టలు పెట్టాను.

10
00:02:43,413 --> 00:02:45,582
వెళ్లు. కాస్త విశ్రాంతి తీసుకో.

11
00:02:45,666 --> 00:02:46,792
సరే.

12
00:03:01,056 --> 00:03:02,182
అవును.

13
00:03:10,524 --> 00:03:13,944
భలే అందంగా తయారయ్యావే?

14
00:03:14,736 --> 00:03:17,322
దేవుడా. అయ్యబాబోయ్.

15
00:03:17,406 --> 00:03:19,491
-హేయ్, షెల్లీ. షెల్, షెల్.
-ఏంటి?

16
00:03:20,284 --> 00:03:21,910
మళ్లీ నా పర్సును తీసుకున్నావా?

17
00:03:22,995 --> 00:03:26,248
అవును, నేనే దాన్ని దొంగలించాను.
దానిలో డబ్బుల కట్టలు ఉన్నాయి కదా మరి.

18
00:03:29,251 --> 00:03:31,336
నేను మళ్లీ వచ్చేసరికి, ఏమో,
కొన్ని రోజులు పడుతుంది.

19
00:03:31,420 --> 00:03:32,880
కళ్లు కాయలయ్యేలా వేచి చూస్తాను.

20
00:03:34,548 --> 00:03:37,593
ఆవిడ ఎప్పుడూ
ఏదోక సమస్య సృష్టిస్తూనే ఉంటుంది.

21
00:03:37,676 --> 00:03:41,972
ఆ చిన్న పిల్లాడే కనుక లేకుంటే, ఈ పాటికి
తనని ఆ ట్రెయిలర్ నుండి గెంటేసుండేదాన్ని.

22
00:03:42,055 --> 00:03:45,434
దీనికంతటికీ అలవాటు పడటానికి
నీకు కాస్త సమయం పడుతుందనుకుంటా.

23
00:03:45,934 --> 00:03:46,935
అవును.

24
00:03:47,603 --> 00:03:50,147
నువ్వు మళ్లీ ఉద్యోగం
కోసం ప్రయత్నించాలి, అంతే.

25
00:03:50,230 --> 00:03:51,481
అంతే.

26
00:03:51,565 --> 00:03:54,026
నీ మనస్సును
నువ్వు కష్టపెట్టుకుంటూ గడపకూడదు.

27
00:03:54,526 --> 00:03:55,569
అలాగే, మేడమ్.

28
00:03:56,862 --> 00:03:59,781
ప్రతీ ఆదివారం నేను చర్చికి వెళ్తాను.

29
00:03:59,865 --> 00:04:02,451
నువ్వు ఇక్కడ ఉంటున్నావంటే
నువ్వు కూడా రావాలని అర్థం.

30
00:04:17,757 --> 00:04:20,469
నీ పూచికత్తుకు సంబంధించిన
నిబంధనలు నీకు తెలుసు కదా?

31
00:04:20,552 --> 00:04:21,637
తెలుసు, సర్.

32
00:04:21,720 --> 00:04:23,055
నువ్వు మాదక ద్రవ్యాల పరీక్ష చేయించుకోవాలి.

33
00:04:23,138 --> 00:04:24,973
ప్రతీ రెండు వారాలకు ఇక్కడికి రావాలి.

34
00:04:25,474 --> 00:04:30,020
నువ్వు మునిసిపల్, మతపరమైన, రాష్ట్ర,
కేంద్ర చట్టాలన్నింటినీ పాటించాలి.

35
00:04:30,103 --> 00:04:31,355
ఉద్యోగం కూడా సంపాదించాలి.

36
00:04:32,481 --> 00:04:33,482
నీకు అంగీకారమేనా?

37
00:04:35,901 --> 00:04:37,319
ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు?

38
00:04:38,320 --> 00:04:39,780
ఇంకా తెలీదు. వెతకాలి.

39
00:04:40,197 --> 00:04:42,157
అయితే రెండు వారాలలో నిన్ను మళ్లీ కలుస్తా.

40
00:04:46,662 --> 00:04:47,955
ఓ మాట చెప్తా.

41
00:04:48,038 --> 00:04:50,832
ఏదైనా ఉద్యోగం అందుబాటులోకి వచ్చినప్పుడు
నీకు కాల్ చేసి సాయపడటానికి ప్రయత్నిస్తా.

42
00:04:51,708 --> 00:04:53,001
-ధన్యవాదాలు.
-పర్లేదు.

43
00:05:20,904 --> 00:05:23,448
-పామర్?
-జైలు నుండి ఎప్పుడు బయటకొచ్చావు, బాసూ?

44
00:05:24,867 --> 00:05:26,034
దేవుడా!

45
00:05:26,118 --> 00:05:28,245
ఇంకో అయిదేళ్ల దాకా
జైల్లోనే ఉంటావనుకున్నాను, గురూ.

46
00:05:28,328 --> 00:05:30,539
-నీకు గడ్డం వస్తుందని నాకు తెలీదే.
-సరేలే.

47
00:05:30,622 --> 00:05:32,499
నువ్వు ఇంటికి వస్తున్నావని
నాకు చెప్పుండాల్సింది.

48
00:05:32,583 --> 00:05:34,293
నీకు ఒక పెద్ద పార్టీ ఇచ్చుండేవాడిని.

49
00:05:34,376 --> 00:05:36,628
-అవునా? ఆ పార్టీకి ఎవరు వస్తారు?
-పిచ్చి నెడ్.

50
00:05:36,712 --> 00:05:38,463
-నేను తప్పకుండా వచ్చేవాడిని.
-చూశావా?

51
00:05:38,547 --> 00:05:40,132
చివరిసారి నేను నీతో మాట్లాడినప్పుడు,

52
00:05:40,215 --> 00:05:42,968
నేను ఆ డబ్బును నువ్వు అడిగినట్టుగానే
జైలు దుకాణం మొహాన కొట్టాను,

53
00:05:43,051 --> 00:05:45,637
-కానీ, నీ నుండి నాకు ఏ కబురూ అందలేదు.
-ధన్యవాదాలు, బాసూ.

54
00:05:45,721 --> 00:05:47,014
ఇంకా ఆ రెండవ వివాహంలోనే ఉన్నావా?

55
00:05:47,097 --> 00:05:48,765
హేయ్, దాని గురించి ఇప్పుడు ఎందుకులే.

56
00:05:48,849 --> 00:05:51,768
అప్పుడు నేనేం ఆలోచించానో కూడా నాకు తెలీదు.
ఇప్పుడు నాకో ఎనిమిదేళ్ల అబ్బాయి ఉన్నాడు,

57
00:05:51,852 --> 00:05:54,438
ఇక డార్లీన్, అవకాశం దొరికినప్పుడల్లా
నాకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

58
00:05:54,521 --> 00:05:57,774
-చిట్టి జేక్ ఎలా ఉనాడు?
-చిట్టి జేక్ కి ఇప్పుడు 15 ఏళ్లు, గురూ.

59
00:05:57,858 --> 00:05:59,359
-పదిహేనా?
-పదిహేను.

60
00:05:59,443 --> 00:06:01,528
-దేవుడా.
-అవును, బేస్ బాల్ కూడా బాగా ఆడతాడు.

61
00:06:01,612 --> 00:06:02,613
-అవును, గురూ,
-అవునా?

62
00:06:02,696 --> 00:06:04,281
-వాడి నాన్నలాగే.
-అందులో సందేహం లేదు.

63
00:06:04,364 --> 00:06:07,326
హేయ్, నీ టచ్ డవున్ రికార్డ్
రెండేళ్ళ క్రితం బ్రేక్ అయిపోయింది.

64
00:06:07,409 --> 00:06:09,036
-అవునా?
-ఎవడో ఫస్ట ఇయర్ కుర్రాడు.

65
00:06:09,119 --> 00:06:11,705
-ఫస్ట్ ఇయర్ కుర్రాడా?
-దేవుడా.

66
00:06:12,206 --> 00:06:14,958
ఎవరొచ్చారో చూడండి. పామర్.

67
00:06:15,876 --> 00:06:17,794
-ఎప్పుడు విడుదల అయ్యావు?
-కొన్ని రోజులయింది.

68
00:06:17,878 --> 00:06:19,463
వావ్.

69
00:06:19,546 --> 00:06:20,631
అది నీకు బాగుంది.

70
00:06:20,714 --> 00:06:23,634
అవును. మా నాన్న తెలుసు కదా. నాకు
వేరే దారి లేకుండా పోయింది.

71
00:06:24,927 --> 00:06:26,094
నిన్ను చూడటం బాగుంది.

72
00:06:26,178 --> 00:06:27,304
అవును, నిన్ను కూడా.

73
00:06:27,930 --> 00:06:30,641
-నువ్వు వివియన్ ఇంట్లో ఉంటున్నావా?
-ప్రస్తుతానికి.

74
00:06:30,724 --> 00:06:33,101
నీకేమైనా అవసరమైతే, నాకు చెప్పు, సరేనా?

75
00:06:33,185 --> 00:06:34,978
నిజంగానే అంటున్నా. ఏ అవసరమైనా కానీ.

76
00:06:35,062 --> 00:06:38,607
అబ్బా. మీ పెద్దయానను నాకు ఆ వేగంగా
నడిపినందుకు జరిమానాలు పంపడం మానమని చెప్పు.

77
00:06:38,690 --> 00:06:40,067
-నాకు అది వినాలని లేదు.
-వెళ్లి పూల్ ఆడదాం పద.

78
00:06:40,150 --> 00:06:42,027
హేయ్, నెడ్, పెళ్ళాం కాల్ చేయకముందే
ఒక ఆట ఆడదాం పద.

79
00:06:42,110 --> 00:06:44,071
పామర్. తర్వాత నువ్వే.

80
00:06:45,656 --> 00:06:46,907
ఇదిగో.

81
00:06:47,866 --> 00:06:48,951
ధన్యవాదాలు.

82
00:06:49,952 --> 00:06:53,789
-కాసిమో, ఏంటి సంగతి?
-నీకేం కావాలి?

83
00:06:54,289 --> 00:06:56,750
నా గోళ్లు తీసి, నాకు వ్యాక్సింగ్ చేయి.

84
00:06:56,834 --> 00:06:58,377
నాకేం కావాలని నువ్వనుకుంటున్నావు?

85
00:07:00,796 --> 00:07:02,422
ఒక జిమ్ అండ్ కోక్ తీసుకురా.

86
00:07:14,268 --> 00:07:16,061
నువ్వు వివియన్ మనవడివి కదా?

87
00:07:20,274 --> 00:07:21,859
ఏంటి సంగతులు, సుందరాంగుడా?

88
00:07:24,194 --> 00:07:25,529
నీకు మాటలు రావా?

89
00:07:37,541 --> 00:07:39,543
నిజంగానే జైలు నుండి
ఇప్పుడే వచ్చినట్టున్నావు.

90
00:07:58,187 --> 00:07:59,730
శ్యామీ

91
00:08:50,072 --> 00:08:52,199
ఎడ్డీ. ఎడ్డీ, లేయి.

92
00:08:52,282 --> 00:08:54,284
లేదంటే చర్చికి ఆలస్యమవుతుంది.

93
00:08:58,997 --> 00:09:02,167
వీడు ఖచ్చితంగా మనకి ఆలస్యం చేస్తాడు.

94
00:09:07,840 --> 00:09:12,386
చర్చి పది గంటలకు మొదలవుతుంది,
ఇప్పుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు.

95
00:09:12,469 --> 00:09:13,595
మన్నించు.

96
00:09:31,697 --> 00:09:35,075
శ్యామ్, వీడు నా మనవడు, ఎడ్డీ.

97
00:09:35,158 --> 00:09:40,747
ఎడ్డీ మంచి పేరే అయినా, నువ్వు వీడిని
పామర్ అనే పిలవాలని కోరుకుంటాడు.

98
00:09:43,917 --> 00:09:46,128
నువ్వు మా అమ్మతో పడక పంచుకున్నావు,

99
00:09:46,795 --> 00:09:49,631
నువ్వు పజమాలను గానీ,
లోదుస్తులను గానీ వేసుకోలేదు.

100
00:09:49,715 --> 00:09:50,716
శ్యామ్.

101
00:09:51,884 --> 00:09:53,385
ఆ కిటికీ మూసేయి.

102
00:09:53,468 --> 00:09:56,346
నా జుట్టును సరిచేసుకోవడానికి
నాకు రెండు గంటలు పట్టింది.

103
00:10:10,944 --> 00:10:13,238
డాట్, నీకు ఎడ్డీ గుర్తున్నాడా?

104
00:10:13,322 --> 00:10:15,866
ఎడ్డీ, ఈవిడ డాట్.

105
00:10:16,450 --> 00:10:17,951
నా మనవడు.

106
00:10:21,288 --> 00:10:23,040
-అలా చేయకు.
-టోబీ, అతనితో నీకేం పని.

107
00:10:23,123 --> 00:10:25,250
అందరికీ శుభోదయం.
అందరికీ ఈ ఉదయాన వెస్లీ చాపెల్ కి

108
00:10:25,334 --> 00:10:26,668
స్వాగతం పలుకుతున్నాను.

109
00:10:28,253 --> 00:10:30,964
మళ్లీ, ఇక్కడికి రావడం అనేది
విచిత్రంగా ఉండుంటుంది కదా?

110
00:10:31,048 --> 00:10:32,633
అందులో సందేహమే లేదు.

111
00:10:32,716 --> 00:10:37,179
ఇక్కడ ఏమంతగా మారలేదు.
చర్చీ, ఫుట్ బాల్, ఇవే ఇక్కడ లోకం.

112
00:10:37,763 --> 00:10:40,557
-అవును.
-ఒక కొత్త కాఫీ షాప్ తెరిచారులే.

113
00:10:41,767 --> 00:10:44,228
-ఎడ్డీ.
-చీఫ్.

114
00:10:44,311 --> 00:10:47,105
-నువ్వు ముందే విడుదలయ్యావని విన్నాను.
-అవును, సర్.

115
00:10:47,773 --> 00:10:50,692
కాస్త మంచిగా ఉండు.

116
00:10:50,776 --> 00:10:52,986
నిన్ను మళ్లీ జైల్లోకి పంపించాలని
నాకు లేదు.

117
00:10:54,738 --> 00:10:55,739
అలాగే, సర్.

118
00:10:56,740 --> 00:11:00,160
-నిన్ను స్టేషన్ లో కలుసుకుంటాను.
-అలాగే, నాన్నా.

119
00:11:00,244 --> 00:11:02,162
అబ్బా. ఆ విషయంలో మన్నించు.

120
00:11:02,246 --> 00:11:03,413
అదే చండశాసనుడు.

121
00:11:03,497 --> 00:11:05,791
అవును, ఇక్కడికి రాకుండా ఉంటే
నేను కూడా ఆశ్చర్యపోయుండేవాడిని.

122
00:11:07,292 --> 00:11:10,128
చూడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు
నిన్ను కలవడానికి వచ్చుండాల్సింది,

123
00:11:10,212 --> 00:11:12,130
కనీసం ఒక లేఖ అయినా రాసుండాల్సింది అని
చెప్పాలనుకుంటున్నాను.

124
00:11:12,798 --> 00:11:14,258
ఒక మంచి మిత్రుడిగా ఉండాల్సింది.

125
00:11:14,883 --> 00:11:16,093
వదిలేయిలే.

126
00:11:16,176 --> 00:11:18,095
-ఏంటి సంగతి?
-హేయ్.

127
00:11:18,178 --> 00:11:19,638
అదే తంతు, కాకపోతే ఇది వేరే ఆదివారం, అంతే.

128
00:11:19,721 --> 00:11:23,684
దేవుడా. ఆ పిల్లాడు నిజంగా తేడాగా ఉన్నాడు.

129
00:11:34,486 --> 00:11:37,573
ఇదిగో. దీన్ని మీ అమ్మకి ఇవ్వు.

130
00:11:37,990 --> 00:11:41,368
ఇది తను తినేలా చూడు.
ఒక వారం దాకా ఇది పాడు కాకుండా ఉంటుంది.

131
00:11:41,451 --> 00:11:44,288
-ధన్యవాదాలు, మిస్ వివియన్.
-మంచి పిల్లాడివి.

132
00:11:44,371 --> 00:11:45,998
-ఉంటాను, మిస్ వివియన్.
-బై బై.

133
00:11:46,623 --> 00:11:47,833
ఉంటాను, పామర్.

134
00:11:55,674 --> 00:11:57,259
శుభరాత్రి, బామ్మ.

135
00:11:57,342 --> 00:12:00,804
శుభరాత్రి, ఎడ్డీ.
నువ్వు విడుదల అయినందుకు నాకు ఆనందంగా ఉంది.

136
00:12:02,598 --> 00:12:03,599
నాకు కూడా.

137
00:12:30,542 --> 00:12:34,046
-నువ్వు ఆలస్యంగా లేచావు.
-అవును అనుకుంటా.

138
00:12:34,796 --> 00:12:36,715
మార్కెట్ నుండి కొన్ని సరుకులు కావాలి,

139
00:12:36,798 --> 00:12:39,593
ఇంటికి వచ్చే దారిలో వాటిని తీసుకురాగలవుగా.

140
00:12:40,802 --> 00:12:41,803
అలాగే, తప్పకుండా.

141
00:12:41,887 --> 00:12:44,765
ఒక్క నిమిషం. నీకు డబ్బులిస్తాను ఆగు.

142
00:12:45,349 --> 00:12:48,060
నీ దగ్గర లేవు అనుకుంటా.

143
00:12:49,603 --> 00:12:50,771
అవును.

144
00:12:50,854 --> 00:12:52,981
బయట జాగ్రత్త.

145
00:12:53,690 --> 00:12:54,900
నేను వచ్చేసరికి ఆలస్యమవుతుంది.

146
00:12:55,526 --> 00:12:57,444
హేయ్, నేను నిజంగానే చెప్తున్నా.
నువ్వు షేవ్ చేసుకోవాలి,

147
00:12:57,528 --> 00:12:59,780
ఎందుకంటే నాకు దాని వలన
నిజంగా చాలా మంటగా ఉంది.

148
00:12:59,863 --> 00:13:02,699
నీ కోసం షేవ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఎంతైనా
నువ్వన్నా, నీ హొయలు అన్నా నాకు ఇష్టం మరి.

149
00:13:02,783 --> 00:13:06,119
-ఎవరు అతను?
-నేనెంటే ఎంత ఇష్టమో మళ్లీ చెప్పు.

150
00:13:07,955 --> 00:13:09,081
ఏదైతే ఏంటిలే.

151
00:13:10,249 --> 00:13:11,917
అతను ఊరికే చూస్తున్నాడు, అంతే.

152
00:13:15,963 --> 00:13:18,590
-ధన్యవాదాలు.
-ధన్యవాదాలు. రోజంతా హాయిగా గడపండి.

153
00:13:18,674 --> 00:13:21,051
-హలో.
-హలో.

154
00:13:23,971 --> 00:13:25,013
ఒక కౌంటర్ మనిషి కావాలి

155
00:13:25,097 --> 00:13:27,057
మీకు అప్లికేషన్ కావాలా?

156
00:13:27,140 --> 00:13:28,225
అలాగే, ఇవ్వండి.

157
00:13:28,892 --> 00:13:32,312
నేను ఆ స్థానంలో ఈ ఉదయానే ఒకరిని చేర్చాను.

158
00:13:33,063 --> 00:13:34,773
-హేయ్, ఎడ్డీ, ఎలా ఉన్నావు?
-హోగన్.

159
00:13:34,857 --> 00:13:36,859
ఈ బోర్డును తీయడం మర్చిపోయాను, అంతే.

160
00:13:38,026 --> 00:13:39,319
నిన్ను చూడటం బాగుంది.

161
00:13:40,028 --> 00:13:41,029
నిన్ను కూడా.

162
00:13:43,532 --> 00:13:47,286
మన్నించండి,
ఇంకా నియమించుకోలేదనే అనుకున్నాను.

163
00:13:49,454 --> 00:13:50,455
ఫర్వాలేదు అండి.

164
00:13:50,956 --> 00:13:52,374
మీకు ఏ వైపు కావాలి?

165
00:13:52,958 --> 00:13:53,959
ఈ వైపు.

166
00:13:54,376 --> 00:13:57,171
దానికి కాస్త తళుకులు అద్దగలను.

167
00:13:57,254 --> 00:13:58,338
అది మంచి విషయమే.

168
00:14:02,384 --> 00:14:04,845
వాడి అమ్మ మళ్లీ ఎక్కడికో వెళ్లిపోయింది.

169
00:14:04,928 --> 00:14:07,264
ఆవిడ వచ్చేదాకా వీడు మనతోనే ఉంటాడు.

170
00:14:10,017 --> 00:14:12,394
నాకు లిప్ స్టిక్ కావాలి.

171
00:14:14,021 --> 00:14:15,105
ఇస్తున్నాను.

172
00:14:16,899 --> 00:14:17,941
ధన్యవాదాలు.

173
00:14:20,027 --> 00:14:23,238
నువ్వు ఇక్కడ సోఫాలో పడుకోవాలి.

174
00:14:23,322 --> 00:14:25,324
రాత్రి పూట మంచం మీద శ్యామ్ పడుకుంటాడు.

175
00:14:25,949 --> 00:14:29,286
సోఫా అయినా నాకు ఫర్వాలేదు, వివియన్.
ఇంట్లో నేను దాని మీదే పడుకుంటాను.

176
00:14:30,287 --> 00:14:32,873
నీ వయస్సు అబ్బాయిలు మంచం మీద పడుకోవాలి.

177
00:14:32,956 --> 00:14:33,957
నాకేమీ ఫర్వాలేదు.

178
00:14:34,041 --> 00:14:35,167
టీవీని చూస్తానులెండి.

179
00:14:36,210 --> 00:14:39,171
టీవీ ఎక్కువగా చూడటం నీకు మంచిది కాదు.

180
00:14:40,464 --> 00:14:42,883
మన్నించాలి. వీటి కోసం వచ్చాను.

181
00:14:45,677 --> 00:14:47,471
నా స్నేహితురాలు, ఎమిలీ
దీన్ని నాకు ఇచ్చింది.

182
00:14:48,805 --> 00:14:52,392
తను కొత్త బొమ్మ కొనుకున్న ప్రతిసారి,
నాకు తన పాత బొమ్మ ఇస్తుంది.

183
00:14:53,268 --> 00:14:54,269
బాబోయ్.

184
00:14:54,770 --> 00:14:58,232
తన కుక్క దీన్ని కొరికేసింది,
కానీ ఫర్వలేదులే.

185
00:14:58,315 --> 00:15:00,526
తను కాస్త ఎగరాలి, అంతే. చూశావా?

186
00:15:02,236 --> 00:15:03,654
నువ్వు అబ్బాయివని నీకు తెలుసు కదా?

187
00:15:05,072 --> 00:15:06,073
తెలుసు.

188
00:15:06,823 --> 00:15:08,450
అబ్బాయిలు బొమ్మలతో ఆడుకోరు.

189
00:15:09,284 --> 00:15:12,037
నేను అబ్బాయినే, కానీ ఆడుకుంటున్నా కదా.

190
00:15:12,120 --> 00:15:13,539
భోజనం సిద్ధంగా ఉంది!

191
00:15:14,873 --> 00:15:16,083
నిన్ను మళ్లీ కలుస్తాను, పామర్.

192
00:15:18,210 --> 00:15:20,504
-చిల్లీ చికెన్.
-ధన్యవాదాలు.

193
00:15:23,715 --> 00:15:25,968
నీకు ఉద్యోగం ఏమైనా దొరికిందా?

194
00:15:27,135 --> 00:15:28,136
ఇంకా లేదు.

195
00:15:28,220 --> 00:15:31,181
-తప్పకుండా దొరుకుతుందిలే.
-మిస్ వివియన్.

196
00:15:34,518 --> 00:15:38,146
-అది తనకి.
-మాకు మా చిల్లీ చికెన్ అంటే ఇష్టం.

197
00:15:40,941 --> 00:15:44,027
ఒకటి నీకు, ఒకటి నాకు.

198
00:15:46,405 --> 00:15:49,032
మీ అమ్మ సాధారణంగా
ఎన్ని రోజులకని వెళ్లిపోతుంది?

199
00:15:49,116 --> 00:15:50,868
నువ్వు కాస్త నోర్మూసుకో.

200
00:15:51,451 --> 00:15:54,788
సూపర్ మార్కెట్ కి వెళ్లి వచ్చావు కదా,
మిగతా చిల్లర ఎక్కడ?

201
00:15:56,665 --> 00:15:59,334
-నీకు ఇచ్చాను కదా.
-లేదు, అది తక్కువయింది.

202
00:16:00,002 --> 00:16:01,170
"తక్కువయింది" అంటే?

203
00:16:01,253 --> 00:16:03,672
నాకు రావాల్సిన చిల్లర రాలేదు.

204
00:16:08,093 --> 00:16:10,512
-లెక్క పెట్టుకో.
-నాకు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు.

205
00:16:10,596 --> 00:16:11,638
అది తక్కువయింది.

206
00:16:11,722 --> 00:16:15,017
పన్నెండు డాలర్ల 13 సెంట్లు.
ఇప్పుడు లెక్క పెట్టుకో.

207
00:16:16,852 --> 00:16:18,478
నువ్వు నీ భోజనం తిను.

208
00:16:33,577 --> 00:16:36,496
సహాయం అవసరం
శుభ్రపరుచువాడు కావాలి

209
00:16:36,580 --> 00:16:40,375
సిల్వేయిన్ ప్రాథమిక పాఠశాల

210
00:16:52,304 --> 00:16:53,305
కస్టోడియన్

211
00:16:54,515 --> 00:16:55,516
తలుపు తెరిచే ఉంది.

212
00:17:00,354 --> 00:17:03,106
నా పేరు ఎడ్డీ పామర్.
ఇంటర్వ్యూ కోసం వచ్చాను.

213
00:17:03,982 --> 00:17:04,983
లోపలికి రా.

214
00:17:06,151 --> 00:17:07,736
నా పేరు కాల్విన్ సిబ్స్. కూర్చో.

215
00:17:10,739 --> 00:17:14,242
ఈ ఫారాన్ని పూరించు, ఆ తర్వాత మనం
ప్రిన్సిపల్ ఫోర్బ్స్ దగ్గరికి వెళ్దాం.

216
00:17:16,411 --> 00:17:20,207
మిస్టర్ పామర్, నన్ను మన్నించాలి,
నేను నిన్ను ఉద్యోగంలోకి తీసుకోలేను,

217
00:17:20,999 --> 00:17:22,291
నువ్వు జైలుకు వెళ్లొచ్చావు కనుక.

218
00:17:24,252 --> 00:17:25,671
నేను అర్థం చేసుకోగలను, సర్.

219
00:17:26,213 --> 00:17:29,049
కానీ నేను ఏ సమస్యా లేకుండా
నా శిక్షను పూర్తి చేసుకొని వచ్చాను.

220
00:17:29,716 --> 00:17:30,968
అది వాస్తవమే కావచ్చు,

221
00:17:31,051 --> 00:17:33,720
కానీ నేను ఇక్కడి పిల్లల క్షేమం గురించి
కూడా ఆలోచించాలి కదా.

222
00:17:34,513 --> 00:17:36,640
నేను పిల్లలకి ఎప్పుడూ కూడా
ఏ అపకారమూ తలపెట్టలేదు.

223
00:17:38,475 --> 00:17:40,310
కనీసం నేలను తుడిచే పని కూడా
నాకు దొరక్కపోతే,

224
00:17:40,394 --> 00:17:43,063
ఇక నేనేం చేయాలో మీరందరూ చెప్పండి.

225
00:17:44,189 --> 00:17:46,149
మిస్టర్ సిబ్స్, మీకేం అనిపిస్తోంది?

226
00:17:47,192 --> 00:17:52,447
ఇతని వద్ద లాండ్రీలో, వంట గదిలో, పెరట్లో
పని చేసిన పన్నెండేళ్ల అనుభవం ఉంది.

227
00:17:53,866 --> 00:17:54,992
కానీ తుది నిర్ణయం మీదే.

228
00:18:01,540 --> 00:18:04,209
రివర్సైడ్ లో ఉన్నప్పుడు ఉత్తమ బేస్ బాల్
ఆటగాడిగా వరుసగా రెండేళ్లు నిలిచావా?

229
00:18:04,710 --> 00:18:05,794
అవును, సర్.

230
00:18:05,878 --> 00:18:07,754
ఎల్ఎస్యూకి ఫుట్ బాల్ ద్వారా ఉపకారవేతనం?

231
00:18:10,090 --> 00:18:11,091
పామర్.

232
00:18:11,675 --> 00:18:13,260
నువ్వు వివియన్ పామర్ కు బంధువువా?

233
00:18:13,343 --> 00:18:15,220
అవును, సర్. తను నాకు బామ్మ అవుతుంది.

234
00:18:15,846 --> 00:18:19,558
సరే, ఆవిడ మా ప్రార్థనా కార్యక్రమంలో
ఒక గౌరవ సభ్యురాలు.

235
00:18:19,641 --> 00:18:22,269
అవును, సర్. పోయిన ఆదివారం
ఆమెతో పాటు నేను కూడా హాజరు అయ్యాను.

236
00:18:23,020 --> 00:18:24,771
చక్కని ధర్మోపదేశం.

237
00:18:26,857 --> 00:18:28,609
సరే, నీకోక విషయం చెప్తాను.

238
00:18:29,818 --> 00:18:32,154
నాకు రెండవ అవకాశాల మీద చాలా నమ్మకం ఉంది.

239
00:18:32,237 --> 00:18:35,032
కాబట్టి, దీన్ని స్కూల్ బోర్డ్
ముందు పెడతాను,

240
00:18:35,115 --> 00:18:37,701
నా పలుకుబడిని ఉపయోగించి,
నీకు ఉద్యోగం వచ్చేలా చేయగలనేమో చూస్తాను.

241
00:18:37,784 --> 00:18:39,203
ధన్యవాదాలు. ధన్యవాదాలు.

242
00:18:39,286 --> 00:18:40,454
ఫర్వాలేదు.

243
00:18:40,537 --> 00:18:42,581
ఈ ఆహారాన్ని మాకు అందించినందుకు,

244
00:18:42,664 --> 00:18:45,667
అలాగే, ఇక్కడ మేము ముగ్గురం కలిసి తినే
అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.

245
00:18:45,751 --> 00:18:47,211
-తథాస్తు.
-తథాస్తు.

246
00:18:47,294 --> 00:18:48,337
తథాస్తు.

247
00:18:51,173 --> 00:18:54,009
మిస్ వివియన్, మీరు నిన్న జరిగినదానికి
క్షమాపణ చెప్పలేదు...

248
00:18:55,093 --> 00:18:58,597
నిన్న అతను చిల్లర తక్కువ ఇచ్చారు అని మీరు
అన్నారు, కానీ అతను సరిగ్గానే ఇచ్చాడు కదా.

249
00:19:00,933 --> 00:19:02,351
శ్యామ్, నువ్వు పాలు తాగు.

250
00:19:06,355 --> 00:19:07,981
నేను తప్పుగా లెక్కేశాను.

251
00:19:08,690 --> 00:19:10,192
నన్ను క్షమించు.

252
00:19:10,692 --> 00:19:11,735
ఫర్వాలేదు.

253
00:19:14,905 --> 00:19:16,156
ఫోన్ ఎవరో నేను చూడనా?

254
00:19:18,617 --> 00:19:20,536
-కూరగాయలు తింటేనే టీవీ చూస్తావు.
-హలో.

255
00:19:20,619 --> 00:19:22,371
-అవును.
-అలాగే, మేడమ్.

256
00:19:22,454 --> 00:19:23,539
అలాగే, సర్.

257
00:19:25,165 --> 00:19:28,168
ధన్యవాదాలు.
సరే, మిమ్మల్ని మళ్లీ కలుస్తాను అయితే.

258
00:19:34,383 --> 00:19:35,384
ఉద్యోగం దొరికింది.

259
00:19:38,387 --> 00:19:39,847
మంచి విషయం, పామర్.

260
00:19:41,056 --> 00:19:42,391
-మంచిది.
-చీర్స్.

261
00:19:43,141 --> 00:19:46,812
బాత్రూంలను, తరగతి గదులను
రోజూ శుభ్రం చేయాలి.

262
00:19:48,063 --> 00:19:51,900
తలుపులను అందరికంటే ముందుగా తెరిచేది మనమే.
పిల్లలు ఆ తర్వాత వెంటనే వచ్చేస్తారు.

263
00:19:51,984 --> 00:19:54,820
సమయానికి వచ్చేలా చూసుకో.
నువ్వు దీన్ని వేసుకోవాలి.

264
00:19:55,237 --> 00:19:56,238
సరే.

265
00:19:56,989 --> 00:19:58,532
నాకు కూడా తాళం చెవులను ఇస్తారా?

266
00:19:59,241 --> 00:20:00,742
ముందు, ఇదెలా సాగుతుందో చూద్దాం.

267
00:20:13,130 --> 00:20:16,550
ఇది అయ్యాక, మ్యాగీ హేయీస్ గదిలోని
ఎయిర కండిషనర్ పని చేయడం లేదట,

268
00:20:16,633 --> 00:20:18,343
-వెళ్లి, దాన్ని బాగు చేయి.
-అలాగే, సర్.

269
00:20:18,427 --> 00:20:19,720
నీకు ఇవి అవసరం అవుతాయి.

270
00:20:22,097 --> 00:20:23,682
భలే గీస్తున్నావు, కెలీ.

271
00:20:24,057 --> 00:20:26,518
-నీ వివరణాత్మక చిత్రాలు నాకు నచ్చాయి.
-మంచు ఫలకాలు.

272
00:20:26,602 --> 00:20:29,521
నాకు అది బాగా నచ్చింది.
అది ఇల్లా లేక చర్చియా?

273
00:20:30,606 --> 00:20:33,358
స్టేసీ, చెప్పా కదా, అది పక్కన పెట్టేయి.

274
00:20:36,528 --> 00:20:38,363
మేడమ్, ఎయిర్ కండిషనర్.

275
00:20:38,447 --> 00:20:40,949
అవును. అది అక్కడ ఉండేది. హమ్మయ్య.

276
00:20:43,202 --> 00:20:44,203
పామర్.

277
00:20:46,455 --> 00:20:49,082
-అతను పామర్.
-"అతను పామర్."

278
00:20:49,666 --> 00:20:51,793
మంచిది. అయితే,
మీరు దీన్ని బాగుచేయగలరు అని ఆశిస్తున్నా.

279
00:20:51,877 --> 00:20:53,462
ఇందులో నుండి
విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి.

280
00:20:53,545 --> 00:20:55,589
ఇక్కడ చాలా వేడిగా ఉంది,
మేము దీన్ని ఉపయోగించలేకపోతున్నాం.

281
00:20:55,672 --> 00:20:56,840
ఆపు, టోబీ!

282
00:20:56,924 --> 00:20:59,343
-టోబీ?
-నేనేమీ చేయలేదు.

283
00:21:00,093 --> 00:21:02,304
నువ్వు గీసినదానికి కూడా అలాగే
ఎవరైనా చేస్తే నీకెలా ఉంటుంది?

284
00:21:02,387 --> 00:21:04,973
వెళ్లి టిష్యూ పేపర్ తీసుకురా,
దాన్ని శుభ్రం చేయడంలో సహాయపడు.

285
00:21:05,557 --> 00:21:07,267
సరేమరి, అందరూ కానివ్వండి.

286
00:21:21,865 --> 00:21:22,866
నాలుగు గంటలకి.

287
00:21:22,950 --> 00:21:25,827
నాకు తెలుసు. నాకు తెలుసు. హేయ్, పామర్,
నువ్వు నా భార్య లూసిల్ ని కలిశావా?

288
00:21:25,911 --> 00:21:27,579
-లేదు.
-మిమ్మల్ని కలవడం బాగుంది.

289
00:21:27,663 --> 00:21:28,664
-మిమ్మల్ని కూడా.
-మీ గురించి చాలా విన్నా.

290
00:21:28,747 --> 00:21:30,415
మీరిద్దరూ ఒకరికొకరు
చిన్నప్పటి నుండి తెలుసు కదా?

291
00:21:30,499 --> 00:21:32,668
అవును. మాకు అయిదేళ్లు ఉన్నప్పటి నుండి.
అప్పుడు కాస్త సన్నగా ఉండేవాడు.

292
00:21:32,751 --> 00:21:33,836
దీన్ని తగ్గించే పనిలోనే ఉన్నాం.

293
00:21:33,919 --> 00:21:35,921
ఎమిలీ, పద. వచ్చి కారు ఎక్కు. బయలుదేరదాం.

294
00:21:36,004 --> 00:21:38,590
వాడి అమ్మ చేసే పనులు చాలా చండాలమైనవి.

295
00:21:38,674 --> 00:21:41,635
ప్రభుత్వం వాడిని ఇంకా తీసేసుకోలేదంటే
నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది.

296
00:21:41,718 --> 00:21:45,264
వాడి వల్ల ఏ సమస్యా లేదు, డాట్.
ఇక నువ్వు ఏం మాట్లాడకు.

297
00:21:45,347 --> 00:21:47,599
నీకు చెప్తున్నా కదా,
నువ్వు ఆ పిల్లాడిని మీ ఇంట్లో ఉంచుకోకూడదు.

298
00:21:50,269 --> 00:21:54,022
కొందరు ఊరికే అనవసరంగా వాగుతుంటారు.

299
00:21:54,106 --> 00:21:55,691
ఎవరు ఆ అనవసరంగా వాగేది?

300
00:21:56,149 --> 00:22:00,320
మా పెద్దవాళ్ల మాటలను వినడం ఆపు, శ్యామ్.

301
00:22:01,196 --> 00:22:04,116
కానీ, మిస్ వివియన్, నేను ఇక్కడే ఉన్నా.

302
00:22:04,658 --> 00:22:06,493
ఉంటే మాత్రం వినేస్తావా.

303
00:22:09,288 --> 00:22:12,624
డాట్ కి, ఎప్పుడూ ఇతరుల విషయాలలో
వేలు పెట్టడం తప్ప మరో పని లేదు.

304
00:22:12,708 --> 00:22:14,209
ఎవరి విషయాలలో?

305
00:22:14,293 --> 00:22:16,461
వినకుండా ఉండమని చెప్పా కదా, శ్యామ్.

306
00:22:17,296 --> 00:22:20,424
మిస్ వివియన్, మీరు మాట్లాడుతూ ఉంటే
నేను వినకుండా ఎలా ఉండగలను చెప్పండి.

307
00:22:20,966 --> 00:22:22,176
దేవుడా!

308
00:22:24,469 --> 00:22:26,096
హాయ్, నా పేరు పెనెలోపి.

309
00:22:26,180 --> 00:22:29,391
ఇది ఆకాశంలోని నా ప్రపంచం,
వీళ్లు నా మిత్రులు.

310
00:22:30,017 --> 00:22:31,226
క్లబ్ కి స్వాగతం.

311
00:22:31,310 --> 00:22:33,061
మీ మంత్రదండాలను సిద్ధంగా ఉంచుకోండి.

312
00:22:33,145 --> 00:22:35,606
మేము రోజూ కలిసి ఎగురుతాము

313
00:22:35,689 --> 00:22:38,066
దార్లో ఇతరులను
మిత్రులుగా చేసుకుంటూ వెళ్తాం

314
00:22:38,150 --> 00:22:40,402
డాట్ సరదాగా వ్యక్తి, ఫీబీ మంచి వ్యక్తి

315
00:22:40,485 --> 00:22:42,779
ఇక నావేమో మెరిసే దుస్తులు

316
00:22:43,322 --> 00:22:45,115
మిస్ వివియన్ ఇంకా పడుకొనే ఉంది.

317
00:22:47,659 --> 00:22:49,745
జనాలు ఏం చెప్తే ఏంటి

318
00:22:49,828 --> 00:22:52,331
మబ్బుల గుండా మేము ఎగురుతూ పోతాం

319
00:22:53,415 --> 00:22:54,499
మీ రెక్కలను చాచండి

320
00:22:54,583 --> 00:22:57,461
పెనెలోపి యొక్క ఎగిరే యువరాణుల క్లబ్ లో

321
00:23:15,521 --> 00:23:17,856
మనం వివియన్ పామర్ కు
శ్రద్దాంజలి ఘటిస్తున్నాము,

322
00:23:18,524 --> 00:23:21,318
మన హృదయాలలో తనకు ఎప్పుడూ స్థానం ఉంటుంది.

323
00:23:22,569 --> 00:23:27,366
తన ఆనందం, నవ్వు,
చక్కగా గడిపిన జీవితాన్ని స్మరించుకుంటూ...

324
00:23:28,534 --> 00:23:30,035
మనం చేసే ఈ తంతులో,

325
00:23:30,827 --> 00:23:35,666
స్వర్గలోకంలో మనం తనని కలిసే దాకా
వివియన్ కు శ్రద్ధాంజలి

326
00:23:35,749 --> 00:23:37,167
ఘటిస్తూనే ఉంటాము.

327
00:23:42,172 --> 00:23:43,590
వివియన్ మంచి మహిళ.

328
00:23:46,552 --> 00:23:49,263
దీన్ని దిగమింగడానికి నీకు కావలసినంత
సమయం తీసుకో, పామర్, సరేనా?

329
00:25:25,651 --> 00:25:26,818
మనం ఎక్కడికి వెళ్తున్నాం?

330
00:25:30,739 --> 00:25:33,408
-నేను బ్యాగుని ఎందుకు సర్దాల్సి వచ్చింది?
-ఆందోళన పడకు.

331
00:25:44,002 --> 00:25:45,546
పద. కారు దిగు.

332
00:25:55,889 --> 00:25:57,391
రా.

333
00:26:00,227 --> 00:26:01,645
పోలీస్

334
00:26:08,735 --> 00:26:10,362
ఈసారి తను వెళ్లిపోయి ఎన్ని రోజులు అయింది?

335
00:26:10,445 --> 00:26:11,655
ఇప్పటికి రెండు వారాలు.

336
00:26:12,489 --> 00:26:14,700
ఇన్నిరోజులూ, అతడిని వివియన్ చేరదీసిందా?

337
00:26:16,201 --> 00:26:19,037
అవునులే. చెప్తున్నా కదా, ఈవిడ...

338
00:26:22,457 --> 00:26:23,458
షెల్లీ బర్డెట్

339
00:26:27,171 --> 00:26:29,673
నేను ఇప్పుడు అందుబాటులో లేను,
కాబట్టి సందేశమేమిటో చెప్పండి.

340
00:26:29,756 --> 00:26:31,258
చెప్పకపోయినా నేనేమీ పట్టించుకోను.

341
00:26:34,595 --> 00:26:37,097
నేను అయితే అతడిని ఇంటికి తీసుకెళ్లలేను.

342
00:26:37,181 --> 00:26:39,600
అంటే, ఎమిలీని చూసుకోవడంతోనే సరిపోతుంది.

343
00:26:40,851 --> 00:26:44,354
వాడితో ఇంకొన్ని రోజులు ఉండలేవంటావా?
మీ ఇంట్లో వేరే గది కూడా ఉంది.

344
00:26:44,438 --> 00:26:45,522
వాడు నా సమస్య కాదు.

345
00:26:47,024 --> 00:26:49,234
సరే. ఇక్కడే వదిలి వెళ్లు.

346
00:26:53,906 --> 00:26:56,491
నేను శిశు సంక్షేమ శాఖకు కాల్ చేస్తాను.

347
00:26:59,328 --> 00:27:01,580
అతను పిల్లల సంరక్షణలోకి వెళ్తాడు.

348
00:27:09,880 --> 00:27:11,006
పామర్.

349
00:27:11,089 --> 00:27:12,299
ఎక్కడికి వెళ్తున్నావు?

350
00:27:55,092 --> 00:27:56,218
అబ్బా.

351
00:28:30,586 --> 00:28:32,629
చాక్లెట్ చిప్ కుకీలు

352
00:29:25,474 --> 00:29:26,475
పామర్.

353
00:29:41,740 --> 00:29:43,367
మిస్ మ్యాగీ నన్ను
ఇంటి దాకా తీసుకువచ్చింది.

354
00:29:44,451 --> 00:29:46,078
-హలో.
-లోపలికి రండి.

355
00:29:46,161 --> 00:29:48,622
ఊరికే పలకరిద్దామని వచ్చాను.

356
00:29:48,705 --> 00:29:50,415
నేను, మీకు తాగడానికి ఏమైనా తీసుకురానా?

357
00:29:51,291 --> 00:29:53,669
నీళ్ళు తీసుకురండి. ధన్యవాదాలు.

358
00:29:53,752 --> 00:29:54,753
అలాగే, తప్పకుండా.

359
00:29:56,421 --> 00:29:59,925
మనమిద్దరం కలిసి చేస్తున్నంత వరకూ
ఏం చేసినా నాకు ఫర్వాలేదు.

360
00:30:00,300 --> 00:30:03,971
-ఆఖరున చేరినవాళ్లు చాలా మంచివాళ్లు.
-మంచివాళ్ళా?

361
00:30:04,054 --> 00:30:07,766
మిస్ మ్యాగీ, ఎగిరే యువరాణులందరూ
చంద్రుడి మీదికి ఎగురుతూ వెళ్తున్నారు.

362
00:30:07,850 --> 00:30:09,935
మీరు ఊహించగలరా?
చంద్రుని మీదికి వెళ్తున్నారు.

363
00:30:10,018 --> 00:30:11,520
అది చాలా గొప్ప విషయం.

364
00:30:11,603 --> 00:30:13,021
నాకు ఇదంటే చాలా ఇష్టం!

365
00:30:13,105 --> 00:30:15,274
ఆగండి. నెమ్మదిగా వెళ్లండి.

366
00:30:15,357 --> 00:30:16,900
-ఇదిగోండి.
-ధన్యవాదాలు.

367
00:30:16,984 --> 00:30:17,985
ఫర్వాలేదు.

368
00:30:19,236 --> 00:30:21,780
చంద్రుని మీదికి ఎగరటమంటే నాకు చాలా ఇష్టం.

369
00:30:21,864 --> 00:30:24,741
హేయ్, వివియన్ కి జరిగింది విని
విచారం తెలుపుతున్నాను.

370
00:30:24,825 --> 00:30:28,662
అంటే, నాకు ఆవిడ అంతగా తెలీదు,
కానీ తను మంచి వ్యక్తిలా అనిపించింది.

371
00:30:29,246 --> 00:30:30,664
తను మంచి మహిళ.

372
00:30:30,747 --> 00:30:34,084
ఈ మధ్య తనే ఎక్కువగా
శ్యామ్ ని చూసుకుంటూ ఉండింది.

373
00:30:35,043 --> 00:30:37,045
మీకు షెల్లీ ఎక్కడికి వెళ్లిందో తెలీదు కదా?

374
00:30:38,380 --> 00:30:39,756
మీలాగే నాకు కూడా అంతగా తెలీదు.

375
00:30:39,840 --> 00:30:41,383
ఒకటి, రెండు, మూడు.

376
00:30:41,466 --> 00:30:43,218
యువరాణి శక్తి. యువరాణి శక్తి...

377
00:30:43,302 --> 00:30:44,887
మరి, అంతా బాగానే ఉందా?

378
00:30:46,221 --> 00:30:49,975
బాగానే ఉంది. అవును, ఫర్వాలేదు.

379
00:30:50,601 --> 00:30:53,145
తను ఎప్పుడూ కూడా
మరీ ఎక్కువ రోజులు రాకుండా లేదు.

380
00:30:53,896 --> 00:30:55,189
దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.

381
00:30:55,272 --> 00:30:57,357
నేను మీకు నా ఫోన్ నంబర్ ఇస్తాను,

382
00:30:57,441 --> 00:31:01,111
మీకు ఏమైనా సందేహాలున్నా, ఏమైనా కావాలన్నా,

383
00:31:01,195 --> 00:31:03,572
లేదా మీరు వేగలేకపోయినా,
మీరు నాకు కాల్ చేయండి చాలు.

384
00:31:04,239 --> 00:31:06,074
అలాగే, తప్పకుండా.
అది చాలా ఉపయోగకరం అవుతుంది.

385
00:31:06,158 --> 00:31:07,367
మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా?

386
00:31:07,451 --> 00:31:10,329
లేదు. కానీ... గోడ మీద ఒక ఫోన్ ఉంది.

387
00:31:10,829 --> 00:31:12,706
-నంబర్ చెప్పగలరా?
-తప్పకుండా.

388
00:31:12,789 --> 00:31:13,957
పాత పద్ధతి అన్నమాట.

389
00:31:14,666 --> 00:31:16,668
శ్యామ్ ని అడిగాను, నాతోనే ఉండగలవా అని,

390
00:31:16,752 --> 00:31:19,213
కానీ నీతో ఇక్కడ
ఉండాలనుకుంటున్నాడని చెప్పాడు.

391
00:31:19,296 --> 00:31:20,380
మెరుపులు!

392
00:31:20,797 --> 00:31:22,216
ఇది మీ మంచితనానికి నిదర్శనం.

393
00:31:22,716 --> 00:31:25,427
చాలా మంది అయితే ఈపాటికి
వాడిని వదిలేసి ఉండేవాళ్లు.

394
00:31:25,511 --> 00:31:28,514
నేను ఏం చేయాలి?

395
00:31:28,597 --> 00:31:30,641
బాబోయ్. అది డ్రేగన్?

396
00:31:30,724 --> 00:31:32,976
-ఉంటాను, శ్యామ్.
-బై, మిస్ మ్యాగీ.

397
00:31:33,810 --> 00:31:35,020
ధన్యవాదాలు.

398
00:31:35,729 --> 00:31:38,273
నేను ఇప్పుడు అందుబాటులో లేను,
కాబట్టి సందేశమేమిటో చెప్పండి.

399
00:31:38,357 --> 00:31:39,733
చెప్పకపోయినా నేనేమీ పట్టించుకోను.

400
00:31:52,037 --> 00:31:53,038
ఏం ఆడుతున్నావు?

401
00:31:54,164 --> 00:31:55,165
పేకాట.

402
00:31:56,458 --> 00:31:57,459
నేను కూడా ఆడవచ్చా?

403
00:31:58,043 --> 00:31:59,795
లేదు, ఇది ఒక్కరే ఆడాలి.

404
00:32:07,511 --> 00:32:09,346
అది అబ్బాయా, అమ్మాయా?

405
00:32:12,391 --> 00:32:13,392
ఇవాళ నువ్వు స్నానం చేశావా?

406
00:32:13,851 --> 00:32:16,103
ఇందాకే చేశాను.

407
00:32:20,440 --> 00:32:21,650
కంపుకొడుతున్నావు.

408
00:32:23,819 --> 00:32:25,320
పామర్!

409
00:32:33,412 --> 00:32:35,831
ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా లేదా
అని తనిఖీ చేస్తున్నాను.

410
00:32:36,582 --> 00:32:38,417
-టీవీ చూస్తున్నాను.
-సరే.

411
00:32:41,044 --> 00:32:42,212
పామర్!

412
00:32:43,797 --> 00:32:45,215
దేవుడా.

413
00:32:45,883 --> 00:32:47,092
ఏంటి?

414
00:32:47,593 --> 00:32:50,095
నువ్వు ఎక్కడికీ వెళ్లిపోవడం లేదు కదా?

415
00:32:50,762 --> 00:32:52,556
లేదు. నేను ఇక్కడే ఉన్నాను.

416
00:32:55,184 --> 00:32:56,393
మీరందరి స్నానం అయిందా?

417
00:32:58,020 --> 00:32:59,521
నా స్నానం అయింది!

418
00:33:03,025 --> 00:33:04,193
ఏంటి?

419
00:33:04,693 --> 00:33:05,819
నా స్నానం అయింది.

420
00:33:06,695 --> 00:33:08,906
అయితే అక్కడి నుండి లేయి. ఇదిగో.

421
00:33:10,908 --> 00:33:11,909
చాలా చల్లగా ఉంది.

422
00:33:13,160 --> 00:33:15,954
డుబోయి అండ్ గిడ్రీలో,
మేమందరి డబ్బును తెచ్చివ్వడానికి...

423
00:33:16,038 --> 00:33:17,623
సరేమరి.

424
00:33:18,123 --> 00:33:19,249
ఇక పడుకో.

425
00:33:20,751 --> 00:33:21,752
పామర్.

426
00:33:24,588 --> 00:33:25,589
ఏంటి?

427
00:33:26,715 --> 00:33:29,134
మా అమ్మ ఎప్పుడు వచ్చేస్తుందో
నీకేమైనా తెలుసా?

428
00:33:30,594 --> 00:33:31,803
లేదు, తెలిసుంటే బాగుండు.

429
00:33:33,889 --> 00:33:37,601
నన్ను వదిలి వెళ్లిపోతున్నందుకు అమ్మ మీద
నాకు అప్పుడప్పుడూ కోపం వస్తూ ఉంటుంది.

430
00:33:38,143 --> 00:33:39,978
మీ అమ్మ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తుందా?

431
00:33:42,814 --> 00:33:44,191
నాకు మా అమ్మ ఎవరో కూడా సరిగ్గా తెలీదు.

432
00:33:45,359 --> 00:33:46,860
కానీ నీకు మీ నాన్న ఎవరో తెలుసు.

433
00:33:47,277 --> 00:33:48,278
అవును.

434
00:33:49,530 --> 00:33:50,739
ఆయన్ని నువ్వు మిస్ అవుతున్నావా?

435
00:33:51,949 --> 00:33:52,950
అవును.

436
00:33:53,575 --> 00:33:55,035
అప్పుడప్పుడు మిస్ అవుతుంటాను.

437
00:33:55,118 --> 00:33:57,037
మిస వివియన్ కూడా ఆయన్ని మిస్ అయ్యేది.

438
00:33:58,539 --> 00:34:00,457
కానీ ఇప్పుడు, ఆవిడ అతడిని కలుసుకోగలదు.

439
00:34:05,254 --> 00:34:06,505
తప్పకుండా కలుసుకుంటుంది.

440
00:34:07,965 --> 00:34:09,174
ఇక పడుకో, శ్యామ్.

441
00:34:09,882 --> 00:34:12,344
పామర్? శుభరాత్రి.

442
00:34:14,638 --> 00:34:15,639
శుభరాత్రి.

443
00:34:56,429 --> 00:35:00,100
సిల్వేయిన్ - ఎడ్డీ పామర్, పూర్తి
ఉపకారవేతనంతో ఎల్ఎస్యూలో చేరుతున్నాడు

444
00:35:06,398 --> 00:35:10,402
మాజీ ఫుట్ బాల్ స్టార్ మీద
హత్యాయత్నం నేరం మోపబడింది

445
00:35:42,267 --> 00:35:44,311
హేయ్. కారు ఎక్కు.

446
00:35:54,947 --> 00:35:56,073
హేయ్, పామర్.

447
00:36:02,412 --> 00:36:03,747
మా అమ్మ నాకు ఇది తెచ్చి ఇచ్చింది.

448
00:36:05,999 --> 00:36:07,626
తను ఇది పాత సామాన్ల అమ్మకంలో కొనింది.

449
00:36:08,961 --> 00:36:12,381
మంచి బేరానికే కొన్నాను అని చెప్పింది,
ఎందుకంటే తనకు ఇది 50 సెంట్లకే దక్కింది.

450
00:36:13,090 --> 00:36:15,634
ఇంకా ఒక బండ అనే పేరు గల ఒక ఆవిడ

451
00:36:15,717 --> 00:36:19,763
దీన్ని మా అమ్మ నుండి లాక్కోవాలని
చూసిందని అమ్మ చెప్పింది.

452
00:36:19,847 --> 00:36:21,390
కానీ మా అమ్మ ఆవిడకి ఆ అవకాశం ఇవ్వలేదు,

453
00:36:22,140 --> 00:36:26,436
ఎందుకంటే ఈ ప్రపంచంలోకెల్లా నాకు యువరాణి
అంటేనే ఎక్కువ ఇష్టమని తనకి తెలుసు.

454
00:36:39,241 --> 00:36:41,326
సరేమరి. మీరు చాలా చక్కగా చేస్తున్నారు.

455
00:36:41,410 --> 00:36:43,453
చెప్పండి, సముద్రంలో ఇంకా మీరు
ఏమేం చూడగలరు?

456
00:36:43,537 --> 00:36:44,705
జెల్లీఫిష్?

457
00:36:44,788 --> 00:36:46,874
జెల్లీఫిష్. మనకి ఏం కనిపిస్తాయి, థామస్?

458
00:37:01,638 --> 00:37:03,182
-పామర్?
-సరేమరి.

459
00:37:03,265 --> 00:37:04,474
నిజంగానా?

460
00:37:05,392 --> 00:37:07,603
సరే. ఆగండి. ఇక్కడే ఉండండి.

461
00:37:07,686 --> 00:37:08,896
హేయ్, ఎడ్డీ.

462
00:37:08,979 --> 00:37:10,606
-హేయ్, నేను లూసిల్ ని,
-హేయ్.

463
00:37:10,689 --> 00:37:13,400
-మనం టామీతో చర్చిలో కలిశాం.
-అవును, అవును.

464
00:37:13,483 --> 00:37:15,694
అవును, మీరు పాఠశాలలో పని చేస్తున్నారని
టామీ చెప్పాడు.

465
00:37:16,653 --> 00:37:17,654
మరి...

466
00:37:18,655 --> 00:37:20,073
శ్యామ్ అంటే ఎమిలీకి చాలా ఇష్టం,

467
00:37:20,157 --> 00:37:23,076
కాబట్టి వాళ్ల ప్లే డేట్ కి మీకు ఏమీ
అభ్యంతరం లేదు కదా అని అడగడానికి వచ్చాను.

468
00:37:23,160 --> 00:37:26,038
మిమ్మల్ని అడగాలని శ్యామ్ చెప్పాడు.
అతనికి మీరే నాన్న అని చెప్పాడు.

469
00:37:26,747 --> 00:37:27,789
ప్లే డేట్ అంటే ఏంటి?

470
00:37:27,873 --> 00:37:31,668
అంటే, వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి వచ్చి,
ఆడుకుంటూ గడుపుతారు అన్నమాట.

471
00:37:31,752 --> 00:37:32,878
దాన్నే ప్లే డేట్ అంటారు.

472
00:37:32,961 --> 00:37:38,091
ఆ తర్వాత, మీరు సుమారుగా
అయిదింటికి వచ్చి అతడిని తీసుకెళ్లిపోవచ్చు.

473
00:37:39,218 --> 00:37:40,677
-అలాగే, తప్పకుండా?
-అలాగేనా?

474
00:37:40,761 --> 00:37:41,803
హేయ్, పిల్లలూ.

475
00:37:43,180 --> 00:37:45,182
-మీకు చెప్పా కదా.
-ఇక పదండి.

476
00:38:02,241 --> 00:38:03,492
చూడండి. అతను ముందే వచ్చేశాడు.

477
00:38:03,575 --> 00:38:06,078
లోపలికి రండి. రండి.

478
00:38:06,828 --> 00:38:08,372
-దేవుడా?
-ఏం చేస్తున్నారు?

479
00:38:08,455 --> 00:38:09,665
రండి.

480
00:38:11,208 --> 00:38:13,669
ఏమో. అతను అక్కడే కూర్చొని ఉన్నాడు.

481
00:38:13,752 --> 00:38:16,255
నేనేమీ కరవనులే. మీరు లోపలికి రావచ్చు.

482
00:38:16,338 --> 00:38:17,923
-లోపలికి...
-అవును.

483
00:38:20,676 --> 00:38:22,344
అతనేం చేస్తున్నాడో తెలియడం లేదు.

484
00:38:23,178 --> 00:38:24,429
వదిలేలా లేదు.

485
00:38:25,514 --> 00:38:26,431
అబ్బా.

486
00:38:27,599 --> 00:38:28,809
మీకేమైనా తీసుకురానా?

487
00:38:28,892 --> 00:38:30,435
-వద్దు, వద్దు. పర్వాలేదు.
-మీకేమైనా కావాలా? సరే.

488
00:38:30,519 --> 00:38:32,145
-మీ కోటును ఏమైనా తీయమంటారా?
-వద్దు, ఫర్వాలేదు.

489
00:38:32,229 --> 00:38:33,939
-హేయ్, పామర్.
-హేయ్, శ్యామ్.

490
00:38:34,022 --> 00:38:35,816
కోల్స్ ఇంకా ఆఫీసులోనే ఉన్నాడా?

491
00:38:36,316 --> 00:38:38,151
అవును. నాకు మాత్రం అదే చెప్తాడు.

492
00:38:39,361 --> 00:38:42,114
చూడండి. ఇది టీ తాగే సమయం, చూశారా?

493
00:38:42,197 --> 00:38:44,116
మీరు ఇక్కడ ఇబ్బంది పడకుండా కూర్చోండి.

494
00:38:44,199 --> 00:38:46,451
నిజానికి, కేవలం... మీరు కూర్చోండి...
ఇది చూడటానికి బాగుంది.

495
00:38:46,535 --> 00:38:47,744
మీకు ఎంత కావాలి?

496
00:38:49,288 --> 00:38:51,456
తన ఉద్దేశం చక్కెర. చక్కెర.

497
00:38:51,540 --> 00:38:52,541
రెండు స్పూన్లు.

498
00:38:56,295 --> 00:38:58,088
జాగ్రత్త, పామర్. వేడిగా ఉంది.

499
00:38:59,006 --> 00:39:01,717
-సర్. ఇది చాలా బాగుంది.
-ధన్యవాదాలు.

500
00:39:04,344 --> 00:39:05,888
చిటికెడు వేలును పైకి ఉంచండి.

501
00:39:05,971 --> 00:39:07,222
చిటికెలు వేలును పైకి ఉంచండి.

502
00:39:10,475 --> 00:39:12,644
ఇంగ్లండ్ లో టీ తాగుతారని నీకు తెలుసా?

503
00:39:12,728 --> 00:39:13,729
తెలుసు.

504
00:39:13,812 --> 00:39:17,065
ఇది చాలా రుచిగా ఉంది.
మీరేమంటారు, మిస్టర్ పామర్?

505
00:39:19,401 --> 00:39:20,736
అవును.

506
00:39:20,819 --> 00:39:21,945
చాలా బాగుంది.

507
00:39:22,029 --> 00:39:24,990
నాకు బాగా నచ్చింది. ఇంకాస్త పోసుకుంటాను.

508
00:39:25,073 --> 00:39:26,700
-ఉంటాను, మిస్ లూసిల్.
-బై, శ్యామ్.

509
00:39:26,783 --> 00:39:28,202
-జాగ్రత్త.
-బై.

510
00:39:28,285 --> 00:39:29,995
టీ పార్టీలంటే నాకు చాలా ఇష్టం.

511
00:39:30,913 --> 00:39:33,540
అయితే, ఎమిలీ నీ ప్రియురాలా?

512
00:39:34,249 --> 00:39:37,377
మేము పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటుందట.

513
00:39:37,461 --> 00:39:39,213
మంచి ఆఫర్ లాగానే ఉంది.

514
00:39:39,296 --> 00:39:42,132
-నేను తనని పెళ్లి చేసుకోను.
-ఏమో ఎవరికి తెలుసు. పెళ్లి చేసుకుంటావేమో.

515
00:39:43,091 --> 00:39:45,427
లేదు. తను పెత్తనం చెలాయించే రకం.

516
00:39:46,220 --> 00:39:47,513
అందులో వింతేమీ లేదులే.

517
00:39:47,596 --> 00:39:49,806
సరే. అలాగే, డారిల్.

518
00:39:49,890 --> 00:39:52,518
సరే, నేను వస్తున్నాను.
వాడు ఆడటం చూడాలని నాకు చాలా ఉంది.

519
00:39:53,435 --> 00:39:54,436
దేవుడా.

520
00:39:55,145 --> 00:39:57,773
హేయ్, నువ్వెప్పుడైనా
ఫుట్ బాల్ ఆటకు వెళ్లావా?

521
00:39:57,856 --> 00:39:59,107
ఫుట్ బాల్?

522
00:40:12,746 --> 00:40:14,373
అక్కడున్న వాడు కనబడుతున్నాడా?
మూడవ నంబర్ జెర్సీ.

523
00:40:14,456 --> 00:40:16,708
అదే క్వార్టర్బాక్. నేను అదే ఆడేవాడిని.

524
00:40:16,792 --> 00:40:19,711
-మంచిది. జెర్సీ నంబర్ ఏమైనా ఉందా?
-ఉంది, తొమ్మిది.

525
00:40:19,795 --> 00:40:21,171
-ఎవరు వచ్చారో చూడండి.
-హేయ్.

526
00:40:21,255 --> 00:40:22,965
-హాయ్, మిస్టర్ కోల్స్.
-హేయ్, శ్యామీ.

527
00:40:23,048 --> 00:40:25,384
మొన్న మీరందరూ టీ పార్టీ చేసుకున్నారట.

528
00:40:25,467 --> 00:40:26,468
అవును.

529
00:40:26,552 --> 00:40:29,763
కంగారుపడకు.
నేను కూడా కొన్ని పార్టీలకి వెళ్ళాను.

530
00:40:29,847 --> 00:40:30,848
అందులో సందేహమే లేదు.

531
00:40:30,931 --> 00:40:33,767
దేవుడా. మ్యాక్స్, మోర్గన్,
కంచె మీద నుండి దిగండి!

532
00:40:33,851 --> 00:40:35,561
కర్తవ్యం పిలుస్తోంది మరి.
మీరు ఆటను ఆస్వాదించండి.

533
00:40:35,644 --> 00:40:36,728
-సరే, బాసూ.
-హేయ్!

534
00:40:36,812 --> 00:40:37,980
-నీకు ఆకలిగా ఉందా?
-అవును.

535
00:40:38,063 --> 00:40:40,274
-ధన్యవాదాలు.
-చాలా చాలా ధన్యవాదాలు.

536
00:40:40,357 --> 00:40:41,567
హేయ్, మిస్ మ్యాగీ.

537
00:40:41,650 --> 00:40:44,528
శ్యామ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?
ఇప్పుడు రెబెల్స్ అభిమాని అయిపోయావా?

538
00:40:44,611 --> 00:40:48,991
అవును, అక్కడ క్వార్టర్బాక్ ఉన్నాడు.
పామర్, తను ఆడేటప్పుడు అదే ఆడేవాడు.

539
00:40:49,074 --> 00:40:51,285
-క్వార్టర్బాక్, హా?
-అది చాలా కాలం కిందటి మాట.

540
00:40:51,368 --> 00:40:53,036
నీకు ఏం కావాలి?

541
00:40:53,704 --> 00:40:54,830
నాకు తెలుసులే.

542
00:40:55,414 --> 00:40:56,498
-కుకీలు.
-కుకీలు.

543
00:40:56,582 --> 00:40:57,958
కుకీలు!

544
00:40:58,625 --> 00:41:00,460
-సరే. దీనికి నేను కడతానులే, బుల్లోడా.
-ధన్యవాదాలు.

545
00:41:00,544 --> 00:41:02,379
వారాంతానికి ఇంకా ఏమేమి చేయబోతున్నావు?

546
00:41:02,462 --> 00:41:03,463
ఏమో.

547
00:41:04,131 --> 00:41:06,633
రేపు నాతో బౌలింగ్ నిధుల సమీకరణకి వస్తావా?

548
00:41:06,717 --> 00:41:09,553
-అలాగే. పామర్ కూడా రావచ్చా?
-లేదు. మిస్ మ్యాగీ నిన్ను మాత్రమే రమ్మంది.

549
00:41:09,636 --> 00:41:11,513
తనేమీ పట్టించుకోదు. కదా, మిస్ మ్యాగీ?

550
00:41:11,597 --> 00:41:14,725
-అవును, మీరు కూడా నిశ్చింతగా రావచ్చు.
-నేను రాలేను. నాకు వేరే పనులు ఉన్నాయి.

551
00:41:14,808 --> 00:41:18,020
నీకేమీ పనులు లేవు. అబద్ధమాడుతున్నావు.
నీకు పనులేవీ లేవు.

552
00:41:18,103 --> 00:41:19,730
ప్లీజ్ పామర్. రా.

553
00:41:19,813 --> 00:41:21,440
-ఎవరికో మీరు రావాలని బాగా ఉన్నట్టుంది.
-నువ్వు రావాల్సిందే.

554
00:41:21,523 --> 00:41:23,942
-సరే, అలాగే. వస్తాను.
-అదీ.

555
00:41:24,026 --> 00:41:27,738
సోదరసోదరీమణులారా,
రివర్సైడ్ రిబెల్స్ కి, హనీ బెల్స్ కి

556
00:41:27,821 --> 00:41:32,284
పుట్టినిల్లు అయిన రివర్సైడ్ హైకి
మీకు స్వాగతం పలుకుతున్నాను.

557
00:41:33,368 --> 00:41:34,369
పామర్!

558
00:41:35,120 --> 00:41:36,914
-ఏంటి సంగతి, పామర్?
-హేయ్, సిబ్స్. ఎలా ఉన్నావు?

559
00:41:36,997 --> 00:41:37,998
సరేమరి.

560
00:41:38,081 --> 00:41:40,042
లాటరీ టిక్కెట్లను కొనడం మర్చిపోకండి.

561
00:41:40,125 --> 00:41:43,670
లాటరీ టిక్కెట్ల ధర అయిదు డాలర్లు.
అయిదు డాలర్లు. వాటి ద్వారా వచ్చిన డబ్బు...

562
00:41:43,754 --> 00:41:45,339
సరేమరి, సమయానికే వచ్చేసినట్టున్నాం.

563
00:41:45,422 --> 00:41:48,091
హేయ్, బుడ్డోడా. వాటిలో నాకు ఒకటి ఇస్తావా?

564
00:41:49,510 --> 00:41:50,511
ధన్యవాదాలు.

565
00:41:50,594 --> 00:41:52,596
పిల్లోడిని సాకడంలో
నువ్వు ఎలా ఇరుక్కుపోయావు?

566
00:41:54,890 --> 00:41:57,309
హేయ్, షెల్లీతో
ఎలాంటి సంబంధం పెట్టుకోకు, బాసూ.

567
00:41:58,685 --> 00:42:01,813
నా మాట నమ్ము. తనకి నువ్వు
ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.

568
00:42:01,897 --> 00:42:03,398
లేకపోతే తను వదిలే రకం కాదు.

569
00:42:05,192 --> 00:42:06,652
నువ్వు మళ్లీ మన ఊరికి రావడం ఆనందంగా ఉంది.

570
00:42:06,735 --> 00:42:09,154
-కుకీ, కుకీ, కుకీ.
-నెడ్, నెడ్.

571
00:42:09,238 --> 00:42:11,281
-వాడి కుకీలను వాడిని తిననివ్వు.
-బాల్ జారిపోయింది!

572
00:42:11,365 --> 00:42:12,950
మంచి ఆట, బాసూ.

573
00:42:13,700 --> 00:42:15,244
బాగా ఆడుతున్నారు.

574
00:42:16,161 --> 00:42:18,997
చూడు, కనబడ్డాడా? పదవ నెంబరు.
వాడే నా కొడుకు, జేక్, అదుగో వాడే.

575
00:42:19,081 --> 00:42:20,082
అవును. నాకు కనబడుతున్నాడు.

576
00:42:20,874 --> 00:42:22,417
ఈ సీజన్ లో వాళ్లు ఎలా ఆడుతున్నారు?

577
00:42:22,501 --> 00:42:24,253
తమాషాగా అడుగుతున్నావా?
3-0తో దూసుకెళ్తున్నారు.

578
00:42:24,336 --> 00:42:26,463
చివరి ఆటను మూడు టచ్ డవున్లతో గెలిచారు.

579
00:42:26,547 --> 00:42:28,882
ఆలాంటి విధ్వంసకర ఆటని నేను చూసి
చాలా ఏళ్ళవుతుంది.

580
00:42:35,264 --> 00:42:36,265
హేయ్...

581
00:42:36,932 --> 00:42:38,851
వెస్లర్ అబ్బాయిని నువ్వు ఎప్పుడైనా
చూడటం జరిగిందా?

582
00:42:39,935 --> 00:42:40,978
ఎందుకు?

583
00:42:41,770 --> 00:42:44,982
అతని కోసం, వాళ్ల నాన్న కోసం వెతికాను.
ఇద్దరూ నాకు కనబడలేదు.

584
00:42:46,316 --> 00:42:49,403
బాసూ, నువ్వు దాన్ని మర్చిపోవాలి.

585
00:42:52,239 --> 00:42:54,783
నువ్వు వాడి కొడుకును కూడా
వాయించి ఉండాల్సింది.

586
00:42:54,867 --> 00:42:56,034
లేదు.

587
00:42:56,118 --> 00:42:59,621
వాడి నాన్న దగ్గర బాగా డబ్బు ఉందని
గొప్పలకు పోయింది వాడే కదా.

588
00:42:59,705 --> 00:43:01,915
అసలు అక్కడ ఏమీ జరగలేదని కూడా గుర్తుంచుకో.

589
00:43:03,792 --> 00:43:05,377
మరి నువ్వు ఏం చేసినందుకు జైలుకు వెళ్లావు?

590
00:43:05,460 --> 00:43:07,671
వాళ్ల నాన్న బతికాడు కదా?
అతను బాగానే ఉన్నాడు.

591
00:43:07,754 --> 00:43:10,382
చెక్క బ్యాట్ కాకుండా అల్యుమీనియం
బ్యాట్ వాడావు కాబట్టి బతికిపోయాడు.

592
00:43:10,465 --> 00:43:11,884
లేకుంటే చచ్చుండేవాడు.

593
00:43:15,053 --> 00:43:18,265
హేయ్, నువ్వు శిక్షని అనుభవించేశావు, పామర్.
ఇక నువ్వెవ్వరికీ ఏమీ రుణపడి లేవు.

594
00:43:19,474 --> 00:43:21,768
కోల్స్ లాగా కాదు.

595
00:43:22,686 --> 00:43:25,314
నిన్నో వెధవలాగా ఒంటరిగా వదిలేశాడు.

596
00:43:25,397 --> 00:43:26,565
నేనేమీ సోది వాగడం లేదు.

597
00:43:26,648 --> 00:43:28,817
నీకు ఎవరి మీదైనా కోపం ఉండాలి అంటే
అది అతని మీదనే ఉండాలి.

598
00:43:30,527 --> 00:43:32,404
పాస్ చేశాడు, జేక్ రీడ్...

599
00:43:32,487 --> 00:43:34,072
అదీలెక్క!

600
00:43:34,656 --> 00:43:37,910
నేనేం చెప్పాను?
వాడి అబ్బలాగే వాడు కూడా పోటుగాడు.

601
00:43:38,493 --> 00:43:40,454
సోదరసోదరీమణులారా, హనీ బెల్స్!

602
00:43:40,537 --> 00:43:42,247
హనీ బెల్స్.

603
00:43:46,793 --> 00:43:48,921
రివర్సైడ్ మా సొంతం!

604
00:43:49,546 --> 00:43:51,256
రివర్సైడ్ మా సొంతం!

605
00:43:53,050 --> 00:43:55,469
నువ్వు లోపలికి వెళ్లు, నేను ఇక్కడే ఉంటా,
తలుపు మూసి తాళం వేసుకో.

606
00:43:55,552 --> 00:43:56,970
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?

607
00:43:57,054 --> 00:43:58,597
కంగారుపడకు. అది పెద్దవాళ్ల వ్యవహారం.

608
00:43:59,348 --> 00:44:01,099
నేనెందుకు నీతో రాకూడదు?

609
00:44:01,183 --> 00:44:02,476
రాకూడదని నేను అన్నాను కాబట్టి.

610
00:44:03,143 --> 00:44:07,064
నాకు హనీ బెల్స్ అంటే ఇష్టం.
మా అమ్మ హనీ బెల్ లో ఉండేది.

611
00:44:07,981 --> 00:44:09,316
అందులో సందేహమే లేదు.

612
00:44:09,900 --> 00:44:10,984
ఇక తలుపు మూసుకో.

613
00:44:12,945 --> 00:44:13,946
తాళం వేసేయి.

614
00:44:21,912 --> 00:44:23,664
కాదు, తన పేరు బబ్బా-జీన్...

615
00:44:24,706 --> 00:44:26,458
తనది అలబామాలోని హవానా...

616
00:44:26,542 --> 00:44:29,628
-ఆగు. తన పేరు బబ్బా-జీన్?
-ఇదుగో, బంగారం.

617
00:44:29,711 --> 00:44:31,004
అయితే, తను రావాల్సి ఉంది,

618
00:44:31,088 --> 00:44:33,465
నేను తనకి మా అమ్మమ్మ
కాచిన సారాయిని ఇవ్వాల్సి ఉంది.

619
00:44:33,549 --> 00:44:36,218
-హేయ్, సిబ్స్.
-హేయ్, జేక్.

620
00:44:36,301 --> 00:44:37,636
-హేయ్!
-క్యాచ్ భలే పట్టావు.

621
00:44:37,719 --> 00:44:38,887
భలే గెలిచారు, అబ్బయిలూ!

622
00:44:39,721 --> 00:44:41,390
హేయ్, జేక్!

623
00:44:41,473 --> 00:44:44,893
-టామీ భలే చక్కగా కాపాడాడు. అవును.
-అదరగొట్టేయండి, సరేనా?

624
00:44:45,477 --> 00:44:47,271
-జేక్!
-మేము ఎప్పుడూ చేసే విధంగానే చేశాం.

625
00:44:47,354 --> 00:44:49,898
-అందరూ బాగా ఆడారు.
-హేయ్.

626
00:44:49,982 --> 00:44:52,943
మీ నాన్ననే పలకరించలేనంత
గొప్ప ఆటగాడివి అయిపోయావా?

627
00:44:53,735 --> 00:44:56,029
వెళ్దాం పదండి. బాగా తాగున్నాడు.

628
00:44:58,156 --> 00:45:01,201
నేను వెళ్లి బీర్ తెచ్చుకుంటాను. జేక్.

629
00:45:02,327 --> 00:45:04,246
హేయ్, పామర్. ఇక్కడ చూడు ఎవరున్నారో.

630
00:45:04,329 --> 00:45:06,206
నీ బాస్, సిబ్స్.

631
00:45:07,332 --> 00:45:09,209
హేయ్, నాకో బీర్ ఇవ్వు.

632
00:45:09,293 --> 00:45:12,212
హేయ్, మీ దగ్గర
మా పామర్ ఎలా పని చేస్తున్నాడు?

633
00:45:12,296 --> 00:45:13,630
మీ దగ్గర మంచిగా పని చేస్తున్నాడా?

634
00:45:14,464 --> 00:45:16,300
బాగానే పని చేస్తున్నాడు, డారిల్.

635
00:45:17,217 --> 00:45:19,678
నన్ను క్షమించు.
నిన్ను నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా?

636
00:45:20,804 --> 00:45:22,514
నేను ఇక్కడికి కేవలం తాగడానికే వచ్చాను...

637
00:45:23,640 --> 00:45:24,808
ప్రశాంతంగా.

638
00:45:24,892 --> 00:45:28,353
అవునా, నీకు ప్రశాంతత కావాలంటే
వెళ్లి వేరే బార్ ను వెతుక్కో.

639
00:45:28,437 --> 00:45:30,981
నా బీర్ ఏమైపోయింది?

640
00:45:33,233 --> 00:45:34,526
-నేను వెళ్తాను.
-సరే.

641
00:45:34,610 --> 00:45:37,529
హేయ్, డారిల్. పద.
నీకు బీరును మేము తీసుకున్నాం.

642
00:45:37,613 --> 00:45:40,449
-పద. వెళ్లి పూల్ అడదాం.
-అలాగే.

643
00:45:40,532 --> 00:45:42,701
-అవును, ఆడదాం.
-హేయ్, పూల్ ఆడదాం.

644
00:45:42,784 --> 00:45:44,661
-సరే.
-కోల్స్, మన సామాను తీసుకురా.

645
00:45:48,415 --> 00:45:50,959
శుభోదయం. లేయి.

646
00:45:52,753 --> 00:45:54,796
నాకు బౌలింగ్ కి వెళ్ళాలని
చాలా ఆత్రంగా ఉంది.

647
00:45:56,965 --> 00:45:59,760
-దానితో నువ్వేం చేస్తున్నావు?
-ఇది నీ కోసమే.

648
00:46:02,179 --> 00:46:03,222
వెళ్లి బట్టలేసుకో.

649
00:46:16,026 --> 00:46:17,319
తుఫాను సాయం కోసం బౌలింగ్ నిధి

650
00:46:31,041 --> 00:46:32,167
అదీ!

651
00:46:42,761 --> 00:46:44,638
-పర్వాలేదు.
-బాగుంది!

652
00:46:44,721 --> 00:46:45,722
బాగా వేశాను.

653
00:46:46,348 --> 00:46:48,267
దేవుడా! భలే వేశావు!

654
00:46:49,685 --> 00:46:51,353
బాగా వేశావు, శ్యామీ!

655
00:46:51,436 --> 00:46:53,897
నాకు ఆ చిందులు నచ్చాయి, బాసూ.

656
00:46:56,400 --> 00:46:59,111
నాది అయిపోయింది. ఇంకొన్ని ఆటలు
ఆడటానికి నాకు డబ్బులు ఇస్తావా?

657
00:47:02,072 --> 00:47:03,073
ధన్యవాదాలు.

658
00:47:04,283 --> 00:47:06,118
మనం పది నిమిషాల్లో బయలుదేరుతున్నాం.

659
00:47:06,201 --> 00:47:07,202
సరే.

660
00:47:08,829 --> 00:47:10,497
ఇలాంటిది ఏదైనా మీరు తీసుకున్నారా?

661
00:47:10,581 --> 00:47:13,000
లేదు.
గోడ మీద ఉన్న ఫోన్ ఇంకా పని చేస్తోంది.

662
00:47:15,544 --> 00:47:18,589
అయితే, మీరు రివర్సైడ్ లో
క్వార్టర్బాక్ అన్నమాట.

663
00:47:20,632 --> 00:47:21,967
అవును, అవి మంచి రోజులు.

664
00:47:22,050 --> 00:47:23,886
ఆ తర్వాత నేను ఎల్ఎస్యూకి వెళ్ళాను.

665
00:47:26,847 --> 00:47:28,682
ఏంటి? ఎందుకు ముఖం అలా పెట్టారు?

666
00:47:29,474 --> 00:47:31,560
నేను ఒక రహస్య బుల్ డాగ్స్ అభిమానిని.

667
00:47:32,102 --> 00:47:33,228
మీరు జార్జియాకి వెళ్లారా?

668
00:47:33,312 --> 00:47:35,147
అదరగొట్టండి! వాళ్ల మీద దాడి చేయండి!

669
00:47:35,230 --> 00:47:37,191
లేదు, లేదు. ఆ మాట ఇక్కడ అనకండి.

670
00:47:37,274 --> 00:47:40,402
నేను చెప్పిన మొదటి వ్యక్తి మీరే, కనుక మీరు
ఎవరికైనా చెప్తే, నేను చెప్పలేదని అంటాను.

671
00:47:40,485 --> 00:47:41,778
మీ రహస్యాన్ని నేనెవ్వరికీ చెప్పను.

672
00:47:41,862 --> 00:47:43,197
ధన్యవాదాలు.

673
00:47:44,615 --> 00:47:47,618
నేను ఎల్ఎస్యూకి ఒక ఏడాదే వెళ్లాను,
ఆ తర్వాత...

674
00:47:49,870 --> 00:47:52,080
నేను వేరే విద్య తీసుకున్నాను.

675
00:47:55,459 --> 00:47:57,294
అవును, దాని గురించి నేను కూడా విన్నాను.

676
00:47:58,629 --> 00:47:59,838
జనాలకు గుగుసలాడమంటే సరదా.

677
00:48:00,464 --> 00:48:01,590
అది తెలిసిందే.

678
00:48:03,550 --> 00:48:06,595
ఇక ఇప్పుడు, తిరిగి ఇక్కడికి రావడం, అది...

679
00:48:08,055 --> 00:48:10,349
అదీ! ఇంకో జాక్ పాట్!

680
00:48:10,432 --> 00:48:12,184
మరి, ఇక్కడికి మీరెలా వచ్చారు?

681
00:48:15,270 --> 00:48:17,814
నేను వేరే లోకంలోకి వెళ్లిపోయాను.

682
00:48:19,399 --> 00:48:20,609
పెళ్లి.

683
00:48:21,735 --> 00:48:24,071
అవును, పెళ్లి చేసుకొని
అట్లాంటాలో ఉండేదాన్ని.

684
00:48:24,947 --> 00:48:28,283
ఆయనా, నేనూ కళాశాలలో కలుసుకున్నాం.
చదువు అయిపోగానే పెళ్లి చేసుకున్నాం.

685
00:48:29,409 --> 00:48:30,827
మా మధ్య అంతగా పొసగలేదు.

686
00:48:30,911 --> 00:48:33,539
విడాకులు అయిపోయాక,
నా కుటుంబానికి దగ్గరగా ఉండాలనుకున్నాను.

687
00:48:33,622 --> 00:48:35,207
ఇక్కడ సిల్వేయిన్ లో ఓక కజిన్ ఉంది, కనుక...

688
00:48:36,583 --> 00:48:37,584
ఇక్కడికి మకాం మార్చేశాను.

689
00:48:39,586 --> 00:48:42,339
అంటే, ఒక్కోసారి, ఈ ప్రాంతం మరీ...

690
00:48:43,715 --> 00:48:45,008
ఊరులాగా అనిపిస్తుంది.

691
00:49:16,748 --> 00:49:18,458
చెత్త బుట్టలని కడగాలి.

692
00:49:18,542 --> 00:49:20,961
వాటిని వెనక్కి తీసుకెళ్లు.
అక్కడ పైపు ఉంది. వాటిని శుభ్రంగా కడిగేయి.

693
00:49:21,503 --> 00:49:22,504
అలాగే, సర్.

694
00:49:26,216 --> 00:49:29,469
హేయ్, డారిల్ హై స్కూల్ లో
ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు కాదు.

695
00:49:30,053 --> 00:49:31,263
ఏమంతగా మారలేదు.

696
00:49:31,763 --> 00:49:34,433
నా వరకు నేను వెధవలకు దూరంగా ఉంటాను.

697
00:49:35,642 --> 00:49:36,643
అలాగే, సర్.

698
00:49:43,400 --> 00:49:44,568
శ్యామ్.

699
00:49:44,651 --> 00:49:47,070
-నీతో కాస్త మాట్లాడాలి, ఇలా రా.
-సరే.

700
00:49:57,456 --> 00:50:00,292
ఈ ఉదయం మిస్టర్ పామర్ నిన్ను
ఇక్కడికి తీసుకురావడం గమనించాను.

701
00:50:01,084 --> 00:50:03,170
-అతను ప్రతీసారి దింపుతాడా?
-అవును, సర్.

702
00:50:03,962 --> 00:50:06,465
ఇంకా అతని ఇల్లు మీ ఇంటి పక్కనే కదా?

703
00:50:06,548 --> 00:50:09,259
అతని ఇల్లు మా అమ్మ ట్రెయిలర్
పక్కనే ఉంటుంది.

704
00:50:11,136 --> 00:50:12,638
అతను ఎప్పుడూ నీతో మంవిగా ఉంటాడా?

705
00:50:13,222 --> 00:50:14,515
అవును, సర్.

706
00:50:14,598 --> 00:50:15,974
అంతా బాగానే ఉంది కదా?

707
00:50:22,105 --> 00:50:26,068
శ్యామ్, ఏదైనా అటూఇటూ ఉంటే, అది ఎలాంటిది
అయినా నువ్వు నాకు చెప్పవచ్చు.

708
00:50:29,029 --> 00:50:31,198
ఫర్వాలేదు, బాబూ. చెప్పు.

709
00:50:33,992 --> 00:50:37,412
మీ నోటి నుండి అదో రకమైన వాసన వస్తోంది.

710
00:50:41,166 --> 00:50:43,001
సరే. ఇక నువ్వు ఆడుకో.

711
00:50:49,466 --> 00:50:50,592
పుకిలించు.

712
00:50:52,553 --> 00:50:54,555
కానివ్వు. బట్టలేసుకో. ఆలస్యం కాకూడదు.

713
00:51:03,522 --> 00:51:04,940
నిన్ను రెండు వారాలలో మళ్లీ కలుస్తాను.

714
00:51:06,191 --> 00:51:07,317
నీకు గుడ్ లక్.

715
00:51:13,156 --> 00:51:14,157
బై.

716
00:51:14,867 --> 00:51:16,577
నీకు రూట్ బీర్ ఫ్లోట్లు అంటే ఇష్టమా?

717
00:51:17,244 --> 00:51:19,329
ఏమో. ఇప్పటిదాకా ఎప్పుడూ రుచి చూడలేదు.

718
00:51:20,038 --> 00:51:22,457
ఏంటి? ఇప్పటిదాకా ఒక్కటి కూడా రుచి చూడలేదా?

719
00:51:23,333 --> 00:51:24,334
కమాన్, బాసూ.

720
00:51:26,962 --> 00:51:28,213
ఎలా ఉంది?

721
00:51:29,339 --> 00:51:30,883
అమృతంలా ఉంది.

722
00:51:34,636 --> 00:51:37,222
అతడిని ఎందుకు కలవడానికి వెళ్లావు?

723
00:51:40,350 --> 00:51:43,520
ఎందుకంటే నేను ఒక తప్పు చేశాను,
ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నానో లేదో

724
00:51:43,604 --> 00:51:45,105
అతను పరీశిలిస్తాడు అన్నమాట.

725
00:51:45,731 --> 00:51:46,857
ఏం చేశావేంటి?

726
00:51:49,735 --> 00:51:52,196
అప్పుడు నేను మంచి వాడిని కాదు.

727
00:51:52,988 --> 00:51:54,406
ఒకరిని గాయపరిచాను.

728
00:51:55,240 --> 00:51:58,493
ఇంకా డబ్బుతో పాటు నావి కాని
చాలా వస్తువులను నేను దొంగలించాను.

729
00:51:59,244 --> 00:52:03,248
మా అమ్మ కూడా ఒకసారి డబ్బులు దొంగలించింది,
కానీ తను అతడిని కలవడానికి వెళ్లనే లేదు.

730
00:52:05,250 --> 00:52:08,212
కొందరు దొరికిపోతారు, కొందరు దొరకరు.
నేను దొరికిపోయాను.

731
00:52:10,130 --> 00:52:12,966
మేము పేదవాళ్లం కాబట్టి తను దొంగలించాల్సి
వచ్చిందని అమ్మ చెప్పింది.

732
00:52:13,592 --> 00:52:15,594
చాలా మంది పేదవాళ్లు ఉన్నారు.
వాళ్లందరూ దొంగలించరు.

733
00:52:15,677 --> 00:52:16,720
నువ్వు కూడా దొంగలించావు.

734
00:52:18,555 --> 00:52:21,725
అవును, దొంగలించాను. ఆ పని
చేయకుండా ఉండాల్సిందని అనుకుంటున్నాను.

735
00:52:24,102 --> 00:52:25,312
నేను కూడా దొంగతనం చేశాను.

736
00:52:26,230 --> 00:52:27,272
అవునా?

737
00:52:29,316 --> 00:52:31,527
నువ్వు తీసుకున్నదాన్ని
ఆ వ్యక్తి మిస్ అవుతారని అనుకుంటున్నావా?

738
00:52:32,486 --> 00:52:35,197
తను మిస్ అయిందని నాకు తెలుసు.
తరగతిలో ఏడ్చింది.

739
00:52:35,781 --> 00:52:39,409
దాన్ని ఎవరైనా చుశారా అని మిస్ మ్యాగీ
అడిగింది, నేను లేదు అని చెప్పాను.

740
00:52:40,827 --> 00:52:41,954
అయితే నువ్వు కూడా అబద్ధమాడావు అన్నమాట.

741
00:52:45,290 --> 00:52:48,877
నువ్వు దొంగలించింది ఆ పాపకి ఇచ్చేస్తే
తను సంతోషిస్తుందని అనుకుంటున్నావా?

742
00:52:50,003 --> 00:52:53,423
అవును. నాకు కూడా ఉపశమనంగా ఉంటుందనుకుంటా.

743
00:52:53,966 --> 00:52:55,384
ఆ పనిని తను తప్పక మెచ్చుకుంటుంది.

744
00:53:02,850 --> 00:53:06,854
నేను మిస్ వివియన్ నుంచి కూడా దొంగలించాను,
కానీ అది నేను వెనక్కి ఇవ్వలేను.

745
00:53:06,937 --> 00:53:08,146
అవునా?

746
00:53:10,399 --> 00:53:11,567
అప్పుడు నాకు ఆకలిగా ఉండింది.

747
00:53:13,652 --> 00:53:14,736
ఫర్వాలేదులే.

748
00:53:16,321 --> 00:53:19,867
కానీ నువ్వు మిస్ వివియన్ ని
ఈ ప్రపంచంలో ఏం కావాలని అడిగినా

749
00:53:19,950 --> 00:53:21,368
తను తప్పకుండా సాయం చేస్తుంది.

750
00:53:21,451 --> 00:53:22,578
నువ్వేమంటావు?

751
00:53:23,412 --> 00:53:26,206
అవును, తను సాయం చేస్తుంది అనుకుంటా.

752
00:53:27,666 --> 00:53:28,667
నేను కూడా.

753
00:53:32,588 --> 00:53:35,424
నేనంత చేశాను కనుక నువ్వు నా మీద
అసహ్యమేమీ పెంచుకోవు కదా?

754
00:53:37,593 --> 00:53:39,553
దుప్పటి కప్పుకొని ఇక పడుకో.

755
00:53:40,971 --> 00:53:43,891
సోఫా కంటే ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది.

756
00:53:43,974 --> 00:53:45,809
ఎందుకంటే అది మంచం కాబట్టి.

757
00:53:48,353 --> 00:53:49,354
పామర్?

758
00:53:51,523 --> 00:53:52,524
చెప్పు?

759
00:53:54,860 --> 00:53:55,861
ఏంలేదు.

760
00:53:57,446 --> 00:53:58,447
శుభరాత్రి, శ్యామ్.

761
00:53:59,573 --> 00:54:00,574
శుభరాత్రి.

762
00:54:49,748 --> 00:54:52,543
ఇవాళ మనం అక్కడ
ఇంకా ఏదైనా పెట్టవచ్చు అంటావా?

763
00:54:53,168 --> 00:54:54,169
సరే.

764
00:54:54,253 --> 00:54:56,338
ఆ బ్రెడ్ ని, ఆ ప్లాస్టిక్ సంచిని తీసుకురా.

765
00:55:00,133 --> 00:55:01,510
దాన్ని బల్ల మీద పెట్టు.

766
00:55:04,179 --> 00:55:05,180
కూర్చో.

767
00:55:07,432 --> 00:55:08,642
సరేమరి.

768
00:55:08,725 --> 00:55:11,228
ఇది చాలా మందికి తెలియదు.

769
00:55:11,979 --> 00:55:12,980
నీ వయస్సులో ఉన్నప్పుడు,

770
00:55:13,063 --> 00:55:16,567
రాష్ట్రస్థాయి శ్యాండ్విచ్ తయారీ పోటీలో
మూడేళ్లు వరుసగా నేను గెలిచాను.

771
00:55:17,734 --> 00:55:19,987
రాష్ట్రస్థాయి శ్యాండ్విచ్ తయారీ పోటీ అని
ఏదీ ఉండదే?

772
00:55:20,070 --> 00:55:21,905
ఉండదా? మరి నేనెలా గెలిచాను?

773
00:55:23,073 --> 00:55:26,660
రహస్యమేమిటంటే, నువ్వు మస్టర్డ్ ని
బ్రెడ్ కి ఇరువైపులా

774
00:55:26,743 --> 00:55:28,328
సమంగా పూయాలి.

775
00:55:28,412 --> 00:55:29,705
జడ్జిలకి అది భలే ఇష్టం.

776
00:55:30,789 --> 00:55:31,874
నువ్వు సోది చెప్తున్నావు.

777
00:55:36,837 --> 00:55:38,046
నేను అబద్దం చెప్తున్నాను అంటున్నావా?

778
00:55:40,591 --> 00:55:42,009
నిజంగా చెప్పాలంటే, అవును.

779
00:55:43,927 --> 00:55:45,053
అవును, నేను అబద్దం చెప్తున్నా.

780
00:55:46,680 --> 00:55:48,515
చూడు, నాకొక ఉపకారం చేసిపెట్టు, సరేనా?

781
00:55:49,683 --> 00:55:52,769
నువ్వు కుకీలని తిను, కానీ వాటి కన్నా ముందు
ఇది తినవా?

782
00:55:53,228 --> 00:55:54,521
సరే.

783
00:55:55,105 --> 00:55:56,773
అదీలెక్క. పెట్టేస్తున్నా.

784
00:55:58,275 --> 00:55:59,359
శుభోదయం, శ్యామ్.

785
00:55:59,443 --> 00:56:00,736
హేయ్, మిస్టర్ సిబ్స్.

786
00:56:01,528 --> 00:56:02,779
ముందే వచ్చేశారా?

787
00:56:02,863 --> 00:56:04,239
ముందొచ్చినవాడికే మంచి అవకాశం ఉంటుంది కదా.

788
00:56:31,391 --> 00:56:32,392
పుట్టినరోజు శుభాకాంక్షలు శ్యామ్

789
00:56:32,476 --> 00:56:34,853
...శ్యామ్

790
00:56:34,937 --> 00:56:38,649
పుట్టినరోజు జేజేలు

791
00:56:38,732 --> 00:56:39,816
ఇక ఊదు.

792
00:56:40,984 --> 00:56:42,694
ఒకటి మిగిలి ఉంది. ఒకటి మిగిలి ఉంది!

793
00:56:42,778 --> 00:56:44,321
ఊదు.

794
00:56:44,404 --> 00:56:45,405
అదీ.

795
00:56:48,158 --> 00:56:49,368
నీకు ఇది నచ్చుతుంది అనుకుంటా.

796
00:56:50,786 --> 00:56:53,038
గిటార్! కానీ ఇది
ఎలా వాయించాలో నాకు తెలీదు.

797
00:56:54,248 --> 00:56:58,210
నిజానికి దీన్ని యూకులేలే అంటారు,
ఎలా వాయించాలో నేను చూపుతాను.

798
00:56:58,293 --> 00:56:59,294
ఇదుగో.

799
00:57:00,295 --> 00:57:01,296
అది అన్నమాట.

800
00:57:01,380 --> 00:57:02,381
ఇవి నోట్స్ అన్నమాట.

801
00:57:02,464 --> 00:57:05,217
స, రి, గ, మ.

802
00:57:06,301 --> 00:57:07,636
ఇక నువ్వు ఏం పాడాలంటే

803
00:57:07,719 --> 00:57:11,390
నా కుక్కకి పేలు ఉన్నాయి

804
00:57:11,473 --> 00:57:13,809
-అదెలా ఉందంటావు?
-బాగుంది.

805
00:57:13,892 --> 00:57:14,893
నువ్వు ప్రయత్నించి చూడు.

806
00:57:15,811 --> 00:57:19,106
నా కుక్కకి పేలు ఉన్నాయి

807
00:57:19,189 --> 00:57:20,899
-వావ్!
-చాలా బాగా ఉంది.

808
00:57:20,983 --> 00:57:23,402
-ధన్యవాదాలు.
-మా కుక్కకి నిజంగానే పేన్లు ఉన్నాయి.

809
00:57:24,862 --> 00:57:26,113
మంచి విషయం చెప్పావు.

810
00:57:26,196 --> 00:57:28,365
మళ్లీ ప్రయత్నించు.
మీరు కలిసి పాడగలరేమో చూద్దాం.

811
00:57:28,448 --> 00:57:30,784
నా కుక్కకి పేనులు ఉన్నాయి

812
00:57:30,868 --> 00:57:32,870
నా కుక్కకి పేనులు ఉన్నాయి

813
00:57:33,704 --> 00:57:34,913
నా కుక్కకి పేనులు ఉన్నాయి

814
00:57:34,997 --> 00:57:36,957
-కొని తప్పు పని చేశాను.
-అవును.

815
00:57:39,042 --> 00:57:40,043
ఇక్కడ ఉన్నది మీరేనా?

816
00:57:42,004 --> 00:57:44,798
-అవును.
-భలే ముద్దుగా ఉన్నారే.

817
00:57:45,340 --> 00:57:46,466
సరేలే.

818
00:57:48,010 --> 00:57:49,553
మిమ్మల్ని వివియన్ ఒక్కటే పెంచిందా?

819
00:57:51,221 --> 00:57:53,932
నేను హై స్కూల్ లో ఉండగా
నాన్న చనిపోయాడు.

820
00:57:54,016 --> 00:57:55,225
తనే నన్ను చూసుకుంది.

821
00:57:55,976 --> 00:57:57,144
మరి మీ అమ్మ?

822
00:57:57,769 --> 00:57:59,563
నాకు అయిదేళ్లు ఉన్నప్పుడు
వదిలేసి వెళ్లిపోయింది.

823
00:58:01,023 --> 00:58:02,816
నాకు వివియన్ యే అమ్మ లాంటిది.

824
00:58:08,614 --> 00:58:10,032
మీకు చాలా పోస్టులు వచ్చినట్టున్నాయి.

825
00:58:11,283 --> 00:58:12,284
అవును, నాకు తెలుసు.

826
00:58:13,452 --> 00:58:15,078
మీరు వీటిని తెరవాలని మీకు తెలుసు కదా?

827
00:58:15,162 --> 00:58:18,081
ఎందుకు? అందులో పనికి వచ్చేవి ఏమీ ఉండవు.

828
00:58:18,165 --> 00:58:21,460
మీకు కావాలంటే,
వీటిని పద్ధతిగా పెట్టడంలో సాయపడగలను.

829
00:58:21,543 --> 00:58:22,544
వద్దులేండి, మీకు ఎందుకు అంత శ్రమ.

830
00:58:22,628 --> 00:58:26,507
అది నాకు తెలుసు. వీటిలో
ఏమైనా మంచి కూపన్లు ఉండే అవకాశముంది.

831
00:58:28,091 --> 00:58:29,343
దేవుడా.

832
00:58:29,426 --> 00:58:31,970
హేయ్, దానితో జాగ్రత్త.

833
00:58:34,723 --> 00:58:38,310
సరేమరి, దీని విలువ $12.61.

834
00:58:38,393 --> 00:58:39,394
సరే.

835
00:58:41,230 --> 00:58:44,149
ఇంకోటి సరిగ్గా 13 డాలర్లకు ఉంది,
చిల్లర మీరు తీసుకోవచ్చు.

836
00:58:44,233 --> 00:58:45,484
ధన్యవాదాలు.

837
00:58:47,444 --> 00:58:49,655
-ఇప్పుడు లాయర్ నుండి వచ్చింది తెరవనా?
-సరే. అలాగే.

838
00:58:50,322 --> 00:58:51,365
సరేమరి.

839
00:58:53,450 --> 00:58:54,451
ఏం రాసుంది?

840
00:58:57,538 --> 00:58:58,789
వివియన్ వీలునామా గురించి ఉంది.

841
00:58:58,872 --> 00:59:02,084
లాయర్, మిమ్మల్ని వీలైనంత త్వరగా
కాల్ చేయమని కోరాడు, అంతే.

842
00:59:02,167 --> 00:59:03,210
అంతేనా?

843
00:59:06,255 --> 00:59:07,422
సరే.

844
00:59:07,506 --> 00:59:11,260
మీరు ఎడ్డీ పామర్?
వివియన్ వీలునామా గురించి మీకు తెలుసా?

845
00:59:11,343 --> 00:59:12,594
లేదు, నాకు తెలీదు.

846
00:59:13,512 --> 00:59:15,430
మీ బామ్మ వీలునామా ప్రకారం,

847
00:59:15,514 --> 00:59:17,641
తన ఇంటిని, స్థలాన్ని అమ్మకానికి పెట్టాలి,

848
00:59:17,724 --> 00:59:21,311
ఆ వచ్చిన డబ్బు, సెయింట్స్ ఆఫ్
క్రైస్ట్ చర్చ్ కి విరాళంగా వెళ్తుంది.

849
00:59:21,395 --> 00:59:25,148
కానీ మీకు $5,000 దక్కేలా
సూచనలను కూడా తను ఇచ్చింది.

850
00:59:25,232 --> 00:59:26,483
ఒక్క నిమిషం. తను...

851
00:59:27,442 --> 00:59:29,444
తను ఇంటిని చర్చికి ఇచ్చేస్తుందా?

852
00:59:30,529 --> 00:59:31,738
ఇవేనా తన కోరికలు?

853
00:59:32,531 --> 00:59:34,157
అలాగే ఉన్నాయి మరి.

854
00:59:34,241 --> 00:59:36,201
మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా?

855
00:59:37,828 --> 00:59:40,038
నేను ఎప్పుడు ఖాళీ చేయాల్సి ఉంటుంది?

856
00:59:40,122 --> 00:59:41,915
ఇల్లు విక్రయించబడిన తర్వాత,

857
00:59:41,999 --> 00:59:44,543
ఆ ఇంటిని ఖాళీ చేయడానికి
మీకు 30 రోజుల సమయం ఉంటుంది.

858
00:59:47,504 --> 00:59:51,049
సరేమరి, సిద్ధమేనా?
కుడివైపుకు చటుక్కున తిరగండి.

859
00:59:51,800 --> 00:59:53,260
ఎడమవైపుకు తిరగండి.

860
00:59:53,343 --> 00:59:56,096
-అలా చేయండి. అలా కాదు...
-ఇలానా?

861
00:59:56,180 --> 00:59:58,307
సరేనా? ఇలా చేయండి... అంతే.

862
00:59:58,390 --> 01:00:01,018
హేయ్, శ్యామ్.
ఎందుకు అమ్మాయిలా ప్రవర్తిస్తావు?

863
01:00:02,978 --> 01:00:04,104
ఏమో... నాకు తెలీదు.

864
01:00:04,646 --> 01:00:06,690
ఎందుకో నాకు తెలుసు. ఎందుకంటే వీడు గే.

865
01:00:08,317 --> 01:00:10,152
ఇక చాలు, టోబీ.

866
01:00:11,111 --> 01:00:14,031
హాలోవీన్ కోసం వీడు
ఫెయిరీ వేషం వేసుకుంటాడేమో.

867
01:00:17,075 --> 01:00:18,410
మరి ఆ విషయంలో నువ్వేం చేయగలవు?

868
01:00:18,869 --> 01:00:19,870
ఏంలేదు.

869
01:00:23,290 --> 01:00:24,499
తరగతికి వెళ్లు, శ్యామ్.

870
01:00:26,835 --> 01:00:28,003
మీరందరూ ఇక్కడి నుండి వెళ్లండి.

871
01:00:33,300 --> 01:00:36,303
మళ్లీ ఆ పిల్లాడి మీద చేయి వేస్తే,
ఆ చేతిని నేను విరగ్గొట్టేస్తాను.

872
01:00:36,929 --> 01:00:37,930
అర్థమైందా?

873
01:00:38,972 --> 01:00:39,973
ఇక పో.

874
01:00:49,775 --> 01:00:54,655
గుర్తుంచుకోండి, మీకు పెనెలోపి యొక్క
ఎగిరే యువరాణుల క్లబ్ లో చేరాలని ఉంటే,

875
01:00:54,738 --> 01:00:57,366
మీరు మాకు ఉత్తరం రాస్తే చాలు.

876
01:00:57,449 --> 01:01:00,118
మేము మీకు ఒక సర్టిఫికెట్ కూడా పంపుతాం.

877
01:01:00,202 --> 01:01:01,703
కొత్త సభ్యులంటే నాకు చాలా ఇష్టం.

878
01:01:01,787 --> 01:01:04,748
యువరాణి పెనెలోపి, వాళ్ల కార్యక్రమానికి
మనం ఒక ఉత్తరం రాస్తే,

879
01:01:04,831 --> 01:01:06,917
వాళ్ల క్లబ్ లో చేరవచ్చని చెప్పింది.

880
01:01:07,000 --> 01:01:09,169
వాళ్లు ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

881
01:01:09,253 --> 01:01:11,088
సరే, ఇక అందరూ ఇళ్లకు ఎగిరిపోండి.

882
01:01:11,171 --> 01:01:12,589
నాకోసం ఒక ఉత్తరాన్ని రాయగలవా?

883
01:01:13,257 --> 01:01:14,258
చూడు.

884
01:01:14,341 --> 01:01:17,469
ప్రపంచంలో నువ్వు ఇలా ఉండవచ్చు,
ఇలా ఉండకూడదు అని కొన్ని ఉంటాయి.

885
01:01:17,553 --> 01:01:19,847
-... సాహసం కోసం సిద్ధం.
-సరేనా?

886
01:01:20,389 --> 01:01:22,724
ఆ కార్యక్రమంలో నీకు
ఎంత మంది అబ్బాయిలు కనిపిస్తారు?

887
01:01:23,809 --> 01:01:26,311
-ఎవ్వరూ ఉండరు.
-దాని ద్వారా నీకు తెలిసేదేంటి?

888
01:01:27,354 --> 01:01:29,439
-నేనే మొదటి అబ్బాయిని కావచ్చని.
-ఇవిగోండి.

889
01:01:30,607 --> 01:01:33,569
మెరుపులు! హలో, మెరుపులు.

890
01:01:33,652 --> 01:01:36,154
గెమ్మా, లిల్లీ, రండి.

891
01:01:36,655 --> 01:01:38,657
చూడు! ఇక్కడ ఉంది.

892
01:01:39,324 --> 01:01:40,492
నేను ఇది తీసుకోవచ్చా?

893
01:01:41,285 --> 01:01:44,621
యువరాజు పీటర్ లేదా ఏదైనా సముద్రపు దొంగవి
తీసుకోవచ్చు కదా?

894
01:01:44,705 --> 01:01:47,833
నాకు సముద్ర దొంగగా ఉండాలని లేదు.
నాకు యువరాణి పెనెలోపిగా ఉండాలనుంది.

895
01:01:47,916 --> 01:01:50,210
నువ్వు యువరాణిలా ఉండకూడాదు,
కాబట్టి ఇంకేదైనా తీసుకో.

896
01:01:50,294 --> 01:01:52,754
ఎందుకు? ఎమిలీ ఒక యువరాణిలాగానే వస్తుంది.

897
01:01:52,838 --> 01:01:55,382
-ఎమిలీ ఒక అమ్మాయి.
-అయితే?

898
01:01:57,968 --> 01:01:59,887
ఇటు రా. నన్ను చూడు.

899
01:02:01,597 --> 01:02:05,642
కొన్ని దుస్తులు అమ్మాయిల కోసం చేస్తారు,
కొన్ని అబ్బాయిల కోసం చేస్తారు.

900
01:02:05,726 --> 01:02:09,313
నువ్వు ఇది వేసుకోకూడదని నేను అనడం లేదు.
నువ్వు వేసుకోవచ్చు.

901
01:02:09,396 --> 01:02:11,231
కానీ పిల్లలు చెడుగా ప్రవర్తిస్తారు.

902
01:02:11,315 --> 01:02:14,818
ప్రత్యేకించి, వాళ్లకు అలవాటు లేనిదాన్ని
చూసినప్పుడు.

903
01:02:14,902 --> 01:02:18,780
వాళ్లు ఈ వేషం ఒక అమ్మాయి
వేసుకుంటుందని అనుకుంటారు.

904
01:02:19,489 --> 01:02:21,366
నీ స్నేహితురాలు ఎమిలీలాగా.

905
01:02:22,284 --> 01:02:24,411
వాళ్లు అబ్బాయిల కోసం కూడా
ఇలాంటిది ఒకటి చేయాలి.

906
01:02:24,494 --> 01:02:25,495
వాళ్లు చేశారు కూడా.

907
01:02:27,122 --> 01:02:28,457
అదే పీటర్ యువరాజు డ్రెస్.

908
01:02:33,587 --> 01:02:35,172
నువ్వు హాలోవీన్ కోసం సిద్ధంగా ఉన్నావా?

909
01:02:35,255 --> 01:02:36,465
అవును, ఆగలేకపోతున్నాను.

910
01:02:36,882 --> 01:02:39,009
మీరు ఆనందంగా గడపండి.

911
01:02:39,092 --> 01:02:41,553
ఎడ్డీ పామర్. హలో, శ్యామ్.

912
01:02:42,095 --> 01:02:43,972
ఇంకా నువ్వు ఈ పిల్లాడిని చూసుకుంటున్నావా?

913
01:02:44,056 --> 01:02:46,850
నీకు ఏ చిన్నారినీ చూసుకొనే అర్హత లేదు.

914
01:02:46,934 --> 01:02:48,644
నువ్వొక నేరస్థుడివి.

915
01:02:48,727 --> 01:02:49,811
పద, శ్యామ్.

916
01:02:50,479 --> 01:02:51,522
మీకో విషయం చెప్పనా?

917
01:02:51,605 --> 01:02:54,650
పామర్ ఒక వ్యక్తిని కలుస్తున్నాడు,
చాలా మంచిగా ఉంటున్నాడు.

918
01:02:54,733 --> 01:02:57,152
కాబట్టి నీ పని నువ్వు చూసుకో.

919
01:02:57,236 --> 01:02:58,403
పద.

920
01:02:58,487 --> 01:03:00,781
నేను శిశు సంక్షేమ శాఖకు కాల్ చేస్తున్నా.

921
01:03:00,864 --> 01:03:02,115
హేయ్, శ్యామ్?

922
01:03:04,201 --> 01:03:05,536
నేను మంచిగా ఉంటున్నానా?

923
01:03:08,580 --> 01:03:09,581
చాలా మంచిగా ఉంటున్నావు.

924
01:03:12,334 --> 01:03:13,335
పద.

925
01:03:14,378 --> 01:03:17,923
రేపు హాలోవీన్ కి అందరూ ఏమేమి వేసుకొస్తారా
అని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.

926
01:03:18,006 --> 01:03:19,842
మూడవ జట్టు, మీరు మీ బ్యాగులని
తెచ్చుకోవచ్చు.

927
01:03:20,425 --> 01:03:21,426
బై, బంగారం.

928
01:03:21,718 --> 01:03:25,597
హేయ్, శ్యామ్. రేపు నువ్వు హాలోవీన్ వేషం
వేసుకొని వస్తున్నావా?

929
01:03:25,681 --> 01:03:29,309
ఎగిరే యువరాణి, పెనెలోపి. పామర్ కొనిచ్చాడు.

930
01:03:29,935 --> 01:03:33,772
పెనెలోపి? భలేగా ఉంది.
దాన్ని చూడటానికి నాకు చాలా ఆత్రంగా ఉంది.

931
01:03:33,856 --> 01:03:35,524
-ఉంటాను, మిస్ మ్యాగీ.
-బై.

932
01:03:44,867 --> 01:03:46,076
వేషం బాగానే ఉంది.

933
01:03:46,702 --> 01:03:48,745
ఇది నా నెత్తి మీద నిలవడం లేదు.

934
01:03:49,955 --> 01:03:50,956
ఇటు రా.

935
01:04:03,468 --> 01:04:05,846
అదుగో. అది పని చేస్తుందని ఆశిస్తున్నా.

936
01:04:06,555 --> 01:04:08,974
నేను కూడా అదే ఆశిస్తున్నా. ధన్యవాదాలు.

937
01:04:09,474 --> 01:04:10,517
ఫర్వాలేదు, బుడ్డోడా.

938
01:04:13,520 --> 01:04:16,356
నేను ఊహించి చెప్తా. పింక్ లేదా పర్పుల్.
నువ్వు నిర్ణయించలేవు.

939
01:04:18,066 --> 01:04:20,611
నేను ఎగిరే యువరాణిని, కౌబాయ్.

940
01:04:20,694 --> 01:04:22,613
సవారీ చేద్దాం. డిక్చిక్-డిక్చిక్.

941
01:04:22,696 --> 01:04:25,866
సమాంత అమ్మాయిల వేషం వేసుకుంది.

942
01:04:25,949 --> 01:04:28,368
లోపల ప్యాంటీలు కూడా వేసుకుందేమో.

943
01:04:36,251 --> 01:04:38,253
ఒక్క నిమిషం, పిల్లలూ.

944
01:04:39,254 --> 01:04:42,466
మిస్ మ్యాగీ ఎక్కడుందో ఎవరికైనా తెలుసా?

945
01:04:42,549 --> 01:04:44,218
-మీరు అక్కడే ఉన్నారు కదా!
-తెలీదు.

946
01:04:44,301 --> 01:04:46,887
నేను మ్యాగీని కాదు.
నేను ప్రిన్సిపల్ ఫోర్బ్స్ ని.

947
01:04:46,970 --> 01:04:49,181
అది పెట్టుడు మీసం!

948
01:04:49,848 --> 01:04:53,560
ఇది నిజమైన మిసమే. ఈ ఉదయాన్నే మొలిచింది.

949
01:04:53,644 --> 01:04:55,020
కాదు!

950
01:04:55,103 --> 01:04:57,105
మిస్ మ్యాగీ
బడి ఎగ్గొట్టి వెళ్లిపోయుంటుంది,

951
01:04:57,189 --> 01:05:00,567
ఎందుకంటే ఇవాళ మీకు ప్రిన్సిపల్ ఫోర్బ్స్
బోధించనున్నారు.

952
01:05:00,651 --> 01:05:03,737
-వద్దు.
-అవును, అది నేనే. ఏంటంటే,

953
01:05:03,820 --> 01:05:08,325
హాలోవీన్ గానీ లేదా సంవత్సరంలోని
ఏ రోజైనా గానీ, వాటి ఉద్దేశం ఇదే.

954
01:05:08,408 --> 01:05:11,161
నీకు నువ్వు కావాలనుకున్నట్టు ఉండవచ్చు.

955
01:05:12,996 --> 01:05:14,164
నేను కౌబాయ్ ని!

956
01:05:14,248 --> 01:05:15,374
నువ్వు వ్యోమగామివా?

957
01:05:15,457 --> 01:05:16,792
మంత్రగత్తె కూడా ఉంది.

958
01:05:16,875 --> 01:05:18,168
అది...

959
01:05:18,794 --> 01:05:22,381
నువ్వు యువరాణిలా ఉన్నావే. అవును, అదే.

960
01:05:22,881 --> 01:05:24,091
ఇంకో ఎగిరే యువరాణి.

961
01:05:24,675 --> 01:05:25,801
ఇంకో ఎగిరే యువరాణి.

962
01:05:25,884 --> 01:05:29,221
ఇవాళ అందరూ చాలా బాగున్నారు.

963
01:05:31,098 --> 01:05:34,434
-ట్రిక్ లేదా ట్రీట్!
-నా దగ్గర ట్రీట్లు ఉన్నాయి.

964
01:05:34,518 --> 01:05:36,228
-లోపలికి రండి.
-ధన్యవాదాలు.

965
01:05:36,311 --> 01:05:37,771
ఇవంటే నాకు చాలా ఇష్టం.

966
01:05:38,814 --> 01:05:41,149
-వావ్. మీ ఇల్లు చాలా బాగుంది.
-ధన్యవాదాలు.

967
01:05:41,233 --> 01:05:42,985
హాలోవీన్ కి మీరు ఏ వేషం వేశారు?

968
01:05:43,068 --> 01:05:44,486
-నేనా?
-అవును.

969
01:05:44,570 --> 01:05:45,737
నేను జానిటర్ వేషం వేశాను.

970
01:05:46,655 --> 01:05:48,240
నాకో చేయి అందిస్తావా?

971
01:05:48,323 --> 01:05:49,825
ఇప్పటికే చాలా క్యాండీ తిన్నావు, శ్యామ్.

972
01:05:55,163 --> 01:05:57,040
-అది చాలా బాగుండింది.
-అవును, బాగుంది.

973
01:05:57,124 --> 01:05:59,793
-వాడు ఏం చేస్తున్నాడు?
-టీవీ చూస్తున్నాడు.

974
01:06:00,252 --> 01:06:01,461
వాడికి టీవీ ఉంటే చాలు.

975
01:06:02,087 --> 01:06:03,630
-చీర్స్.
-చీర్స్.

976
01:06:05,048 --> 01:06:08,051
ఇవాళ బడిలో చాలా బాగుండింది.

977
01:06:08,135 --> 01:06:09,178
అది మంచి విషయమే.

978
01:06:09,678 --> 01:06:11,597
వాడు చాలా బాగా సరదాగా గడిపాడనుకుంటా.

979
01:06:16,393 --> 01:06:18,145
డిన్నర్ కోసం మీరు ఇక్కడికి వచ్చినందుకు
ఆనందంగా ఉంది.

980
01:06:19,229 --> 01:06:20,480
నాకు కూడా.

981
01:06:22,191 --> 01:06:23,609
నేను మిమ్మల్ని ఓ విషయం అడగాలి.

982
01:06:26,820 --> 01:06:27,821
సరే.

983
01:06:30,199 --> 01:06:31,992
మీరు జైలుకు ఎందుకు వెళ్లారు?

984
01:06:35,579 --> 01:06:37,122
అది చాలా పెద్ద కథ.

985
01:06:37,206 --> 01:06:38,957
నాకు తెలీదు. అర్థంకూడా కావడం లేదు.

986
01:06:40,167 --> 01:06:41,752
అది మంచి ప్రశ్నే.

987
01:06:52,596 --> 01:06:55,807
ఎల్ఎస్యూలో నా జీవితం సాఫీగానే సాగుతోంది.

988
01:06:57,643 --> 01:07:01,980
కానీ ఒక ఆటలో నాకు చాలా బలమైన గాయమైంది, ఎంత
బలమైనదంటే నా పేరును కూడా నేను మర్చిపోయాను.

989
01:07:04,691 --> 01:07:09,238
కొన్ని శస్త్ర చికిత్సలు జరిగాయి,
దానితో నా ఫుట్ బాల్ జీవితానికి,

990
01:07:09,738 --> 01:07:10,906
కళాశాల జీవితానికి తెర పడిపోయింది.

991
01:07:12,658 --> 01:07:16,745
ఇంటికి వచ్చేశాను.
మత్తు పదార్థాలని తీసుకోవడం మొదలుపెట్టాను.

992
01:07:19,414 --> 01:07:20,624
ఇంకా ఏవేవో చేయడం మొదలుపెట్టాను.

993
01:07:23,168 --> 01:07:24,670
రాత్రుళ్లు జైలులో గడపడం, తర్వాత ఆ పని...

994
01:07:26,129 --> 01:07:27,881
అస్సలు చేయకూడదనుకోవడం మామూలు అయిపోయింది.

995
01:07:31,385 --> 01:07:32,678
ఒక సంపన్న కుర్రాడు ఉండేవాడు.

996
01:07:33,428 --> 01:07:34,805
ఇంట్లోని భీరువాలో వాళ్ల నాన్న

997
01:07:34,888 --> 01:07:38,058
ఇంత డబ్బు పెట్టాడు, అంత పెట్టాడు అని
ఊరికే గొప్పలు చెప్తూ ఉండేవాడు.

998
01:07:39,184 --> 01:07:42,855
ఒక రాత్రి, నేను కొందరితో కలిసి
వాళ్ల ఇంట్లోకి చొరబడ్డాను.

999
01:07:43,772 --> 01:07:45,524
ఇంట్లో ఎవ్వరూ ఉండని సమయంలో వెళ్లాం.

1000
01:07:46,358 --> 01:07:47,985
కానీ వాళ్ల నాన్న ఇంటికి వచ్చేస్తాడు.

1001
01:07:49,152 --> 01:07:50,279
అతని వద్ద ఒక తుపాకీ ఉంది.

1002
01:07:56,910 --> 01:07:58,537
ఆయనని నేను చచ్చేంతలా కొట్టాను.

1003
01:08:03,834 --> 01:08:06,128
తర్వాత కట్ చేస్తే, నన్ను జైల్లో వేశారు.

1004
01:08:09,590 --> 01:08:11,133
మీరు ఒక్కరే కాదా?

1005
01:08:11,675 --> 01:08:14,303
అది ముఖ్యం కాదు.
నేను చేసింది నేనే చేసినట్టు కదా.

1006
01:08:17,598 --> 01:08:18,765
అవును.

1007
01:08:20,642 --> 01:08:22,185
కానీ ఇవాళ మీరేం చేశారో చూడండి.

1008
01:08:49,212 --> 01:08:50,214
వాడు నిద్రపోతున్నాడు.

1009
01:08:54,301 --> 01:08:55,301
మీరు అలసిపోయారా?

1010
01:08:58,764 --> 01:08:59,765
అదేం లేదు.

1011
01:10:10,794 --> 01:10:13,338
వాడు కుంభ కర్డుడిలా నిద్రపోతాడు,
సందేహమే లేదు.

1012
01:10:20,345 --> 01:10:21,346
ఇది చాలా సరదాగా గడిచింది.

1013
01:10:26,059 --> 01:10:27,728
-సరేమరి.
-సరేమరి.

1014
01:10:29,104 --> 01:10:30,606
మిమ్మల్ని బడిలో కలుస్తానులే.

1015
01:10:34,109 --> 01:10:36,069
-శుభరాత్రి.
-శుభరాత్రి.

1016
01:10:38,780 --> 01:10:39,907
ఇంకా చూస్తున్నాను.

1017
01:10:45,954 --> 01:10:48,999
సరేమరి, పిల్లలూ.
మీకు ఇంకొన్ని నిమిషాల సమయం ఇస్తాను.

1018
01:10:49,082 --> 01:10:51,043
తప్పు అయినా ఫర్వాలేదు.

1019
01:10:51,126 --> 01:10:53,253
శ్యామ్, మనం ఇంకో టీ పార్టీ చేసుకుందామా?

1020
01:10:53,337 --> 01:10:54,463
మనం వేషాలు కూడా వేసుకోవచ్చా?

1021
01:10:54,922 --> 01:10:56,048
తప్పకుండా.

1022
01:10:56,131 --> 01:10:57,799
-నేను సిద్ధమే.
-సరే.

1023
01:10:59,801 --> 01:11:02,387
మనం ఏం చేద్దాం, హా? హేయ్, ఎడ్డీ.

1024
01:11:02,471 --> 01:11:04,223
హేయ్, వీళ్లు చాలా ఆత్రంగా ఉన్నారు.

1025
01:11:04,306 --> 01:11:08,143
వినండి. మీరేమీ తొందరపడి రానవసరం లేదు.
అంతా చూసుకొనే రండి, సరేనా?

1026
01:11:08,227 --> 01:11:10,979
డారిల్ కూడా వస్తున్నాడు.
మనందరం కలిసి బీర్ తాగవచ్చు.

1027
01:11:11,063 --> 01:11:13,732
-టామీని అడిగానని చెప్పండి.
-తప్పకుండా. మనం చాలా సరదాగా గడపబోతున్నాం.

1028
01:11:13,815 --> 01:11:15,984
-మళ్లీ కలుద్దాం, పామర్.
-కలుద్దాం, బుడ్డోడా.

1029
01:11:24,076 --> 01:11:26,995
నాతో ఇంటర్నెట్ ని పంచుకో

1030
01:11:36,547 --> 01:11:38,340
సిల్వేయిన్ ప్రాథమిక పాఠశాల

1031
01:11:42,094 --> 01:11:45,430
చట్టబద్ధమైన సంరక్షుడు కావడం ఎలా

1032
01:11:45,514 --> 01:11:48,100
సీ.ఎల్.ఎస్ పిల్లల చట్టపరమైన సర్వీసులు
& సమాచారం

1033
01:11:48,183 --> 01:11:49,226
సంరక్షకత్వ చట్టం

1034
01:11:50,227 --> 01:11:52,437
లూసియానా సంరక్షకత్వ చట్టం

1035
01:11:59,611 --> 01:12:00,737
నేను మీకేమైనా సాయపడగలనా?

1036
01:12:02,114 --> 01:12:03,949
మీ ఎయిర్ కండిషనర్ ఎలా పని చేస్తోంది?

1037
01:12:07,536 --> 01:12:08,954
మీరు నన్ను సమస్యల్లోకి నెట్టేలా ఉన్నారు.

1038
01:12:09,997 --> 01:12:10,998
అవునా?

1039
01:12:13,750 --> 01:12:14,751
అమ్మకానికి గలదు
అలెక్స్ సాలజార్

1040
01:12:16,253 --> 01:12:19,464
-నేను వెళ్లాలి.
-లేదు, వెళ్లనక్కర్లేదు.

1041
01:12:19,548 --> 01:12:21,717
అవును. నేను వెళ్లాలి.

1042
01:12:26,513 --> 01:12:27,681
హేయ్.

1043
01:12:28,724 --> 01:12:29,725
హేయ్.

1044
01:12:31,059 --> 01:12:32,436
నువ్వు నాకో విషయంలో సహాయపడగలవా?

1045
01:12:33,687 --> 01:12:35,397
-సరే.
-ఇలా రా.

1046
01:12:39,776 --> 01:12:42,404
నాకు తెలియడం లేదు. ఈ సామాను అంతా.

1047
01:12:43,488 --> 01:12:45,240
ఇది ఎవరికి ఉపయోగపడవచ్చో నీకేమైనా తెలుసా?

1048
01:12:46,617 --> 01:12:48,702
మా బామ్మ ఆ విషయాన్ని
మెచ్చుకొనేది అనుకుంటా.

1049
01:12:52,414 --> 01:12:53,624
నాకు తెలుసు ఎవరికి ఉపయోగపడుతుందో.

1050
01:12:59,713 --> 01:13:00,797
శ్యామ్!

1051
01:13:02,090 --> 01:13:04,551
-హేయ్, బాసూ.
-నీకేమైంది?

1052
01:13:06,470 --> 01:13:08,472
-ఎడ్డీ, నన్ను...
-ఏం జరుగుతోంది?

1053
01:13:08,555 --> 01:13:11,225
నాకు తెలిస్తే కదా. అతడిని కాసేపు వదిలేసి
పక్కకు వెళ్ళాను. వాళ్లు వేషాలాటలో ఉన్నారు.

1054
01:13:11,308 --> 01:13:14,728
నేను తిరిగి వచ్చి చూస్తే, అతని ముఖమంతా
మేకప్ వేసి ఉంది, ఒకటే ఏడుస్తున్నాడు.

1055
01:13:14,811 --> 01:13:16,772
అసలేం జరిగిందో కూడా నాకు తెలీదు.
నన్ను క్షమించండి.

1056
01:13:16,855 --> 01:13:18,607
ఏమీ కాలేదు. ఏమీ కాలేదు, బంగారం.

1057
01:13:18,690 --> 01:13:20,484
హేయ్, బాసూ. హేయ్.

1058
01:13:20,567 --> 01:13:22,653
నాకూ, మిస్ మ్యాగీకి ఏం జరిగిందో చెప్తావా?

1059
01:13:24,613 --> 01:13:25,864
హేయ్. ఏమీ కాలేదులే.

1060
01:13:26,949 --> 01:13:29,785
మొన్న నిన్ను ఏడిపించిన వాళ్ల పనేనా ఇది?
ఇంకా వాళ్లు అక్కడే ఉన్నారా?

1061
01:13:32,079 --> 01:13:33,413
నా మాట విను.

1062
01:13:33,497 --> 01:13:36,917
నీకు ఇది నచ్చదని నాకు తెలుసు, కానీ
ఒక్కోసారి నువ్వు కూడా ఎదురుతిరగాలి.

1063
01:13:37,626 --> 01:13:38,752
ఎడ్డీ.

1064
01:13:39,253 --> 01:13:40,504
వాళ్లు నా కన్నా పెద్దగా ఉన్నారు.

1065
01:13:40,587 --> 01:13:43,048
నాకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు
ఎదురుతిరగకపోతే,

1066
01:13:43,131 --> 01:13:45,008
ఆ పిల్లలు నిన్ను ఇక ఎప్పటికీ
ఒంటరిగా వదలరు.

1067
01:13:45,092 --> 01:13:46,093
ఎడ్డీ.

1068
01:13:46,176 --> 01:13:48,387
వాళ్లు పిల్లలు కాదు.

1069
01:13:49,513 --> 01:13:51,390
నువ్వేమంటున్నావు?

1070
01:13:51,849 --> 01:13:54,685
నన్ను చూడు, సరేనా?
ఇలా నీకు ఎవరు చేశారు, శ్యామ్?

1071
01:13:55,853 --> 01:13:57,145
పర్వాలేదు. నువ్వు మాకు చెప్పవచ్చు.

1072
01:13:59,690 --> 01:14:01,316
టోబీ నాన్న.

1073
01:14:02,234 --> 01:14:03,277
ఏంటి?

1074
01:14:03,944 --> 01:14:08,782
టోబీ నాన్న. మీ స్నేహితుడు, డారిల్,
అతనే ఇలా చేశాడు.

1075
01:14:12,744 --> 01:14:13,745
హేయ్, ఎడ్డీ.

1076
01:14:16,123 --> 01:14:17,124
హేయ్, ఎడ్డీ.

1077
01:14:18,000 --> 01:14:20,502
ఎడ్డీ. హేయ్, ఎడ్డీ! ఎక్కడికి వెళ్తున్నావు?

1078
01:14:21,003 --> 01:14:22,337
ఎడ్డీ, వద్దు...

1079
01:14:37,603 --> 01:14:41,356
హేయ్, చూడు. వాడు అప్పటికే డ్రెస్ వేసుకొని
ఉన్నాడు. నేను ఆ గే గాడికి ఇంకాస్త...

1080
01:14:42,107 --> 01:14:44,026
పామర్, వద్దు! ఏం చేస్తున్నావు?

1081
01:14:44,109 --> 01:14:45,152
ఆగు!

1082
01:14:46,153 --> 01:14:47,654
-ఎడ్డీ!
-పామర్!

1083
01:14:47,738 --> 01:14:49,615
-పామర్!
-ఎడ్డీ! హేయ్!

1084
01:14:49,698 --> 01:14:51,867
-నన్ను వదలండి!
-ఎడ్డీ, ఎడ్డీ.

1085
01:14:51,950 --> 01:14:53,785
నువ్వేం చేస్తున్నావు? అయ్యబాబోయ్...

1086
01:14:53,869 --> 01:14:55,996
-శాంతించు, బాసూ.
-పామర్. పామర్...

1087
01:14:56,580 --> 01:14:58,332
నీకూ సరదాగా అనిపించుంటుంది కదా, కోల్స్?

1088
01:14:58,415 --> 01:15:01,752
ఒక ఎదిగిన మగాడు ఒక చిన్న పిల్లాడి మీద పడి
మేకప్ వేస్తూ ఏడిపిస్తుంటే?

1089
01:15:01,835 --> 01:15:04,213
-నేను... నేను అక్కడ లేను...
-నువ్వు లేవులే!

1090
01:15:04,296 --> 01:15:06,673
-అది జరిగింది నీ ఇంట్లోనే.
-నేను అప్పుడు అక్కడ లేను.

1091
01:15:08,383 --> 01:15:09,968
ఒక విషయం స్పష్టంగా చెప్తాను.

1092
01:15:10,928 --> 01:15:15,516
మీ నాన్న నన్ను కలవడానికి వస్తే,
ఈ సారి మాత్రం నువ్వు తప్పించుకోలేవు.

1093
01:15:16,850 --> 01:15:18,268
నా మాట నమ్ము.

1094
01:15:19,895 --> 01:15:21,313
పన్నెండేళ్ళు!

1095
01:15:33,116 --> 01:15:34,743
అందరూ ఏం చూస్తున్నారు?
సినిమా అయిపోయింది.

1096
01:15:34,826 --> 01:15:36,370
-దేవుడా.
-కమాన్. పద.

1097
01:15:36,453 --> 01:15:37,955
-పైకి లేయి.
-బాబోయ్, డారిల్.

1098
01:15:38,038 --> 01:15:39,206
కమాన్.

1099
01:15:40,249 --> 01:15:42,876
-ఇతనికి ఏమీ కాలేదు కదా?
-దేవుడా.

1100
01:15:53,637 --> 01:15:54,805
ఏం చేయాలనుకుంటున్నావు?

1101
01:15:56,181 --> 01:15:57,724
వాడిని ఏడిపించే వాళ్లనందరినీ కొడతావా?

1102
01:15:58,642 --> 01:16:00,686
అందరినీ కాదు, 30 ఏళ్లు దాటిన వాళ్లనే.

1103
01:16:00,769 --> 01:16:03,522
పరిస్థితులను ఇతర పద్ధతుల్లో కూడా
హ్యాండిల్ చేయవచ్చు.

1104
01:16:06,108 --> 01:16:09,152
-నువ్వు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంటావా?
-డారిల్ ఫిర్యాదుల్లాంటివి ఏమీ చేయడు.

1105
01:16:10,153 --> 01:16:11,196
నీ అదృష్టం బాగుంది.

1106
01:16:14,199 --> 01:16:15,701
శ్యామ్ ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయాడు...

1107
01:16:16,618 --> 01:16:17,828
నీ కోసం అడుగుతూనే ఉన్నాడు.

1108
01:16:27,629 --> 01:16:28,839
హేయ్, నేను...

1109
01:16:54,239 --> 01:16:55,365
నీకోసం ఇది తెచ్చాను.

1110
01:17:06,168 --> 01:17:08,170
శ్యామ్. నేను చెప్పేది విను.

1111
01:17:09,588 --> 01:17:12,257
నీ పట్ల డారిల్ చేసింది దారుణమైన పని.

1112
01:17:13,550 --> 01:17:14,676
నీకు అది తెలుసు కదా?

1113
01:17:15,844 --> 01:17:17,638
నువ్వు ఏ చెడ్డపనీ చేయలేదు.

1114
01:17:18,764 --> 01:17:19,806
నా మాట అర్థమవుతోంది కదా?

1115
01:17:20,349 --> 01:17:22,518
-సరే.
-నీ తప్పేమీ లేదు.

1116
01:17:23,977 --> 01:17:25,020
అర్థమవుతోంది కదా, బాబూ?

1117
01:17:25,812 --> 01:17:26,813
అర్థమవుతోంది.

1118
01:17:27,564 --> 01:17:28,565
సరే.

1119
01:17:29,650 --> 01:17:32,236
హేయ్, నాకో ఆలోచన తట్టింది.

1120
01:17:32,945 --> 01:17:33,946
పద.

1121
01:17:35,364 --> 01:17:37,783
సరేమరి. ఇప్పటిదాకా మనం రాసింది ఇదే.

1122
01:17:38,659 --> 01:17:41,161
"ప్రియమైన
పెనెలోపి ఎగిరే యువరాణుల క్లబ్"...

1123
01:17:41,828 --> 01:17:43,914
-నేను రాసింది సరిగ్గానే ఉంది కదా?
-అవును.

1124
01:17:43,997 --> 01:17:47,793
"నా పేరు శ్యామ్, నాకు సభ్యుడిని కావాలని
ఎంతగానో ఉంది."

1125
01:17:48,460 --> 01:17:52,130
వారి కార్యక్రమంటే నాకు చాలా ఇష్టమని,
దాన్ని రోజూ చూస్తానని రాయడం మర్చిపోకు.

1126
01:17:52,214 --> 01:17:57,427
"నేను మీ కార్యక్రమాన్ని చూస్తాను...

1127
01:17:59,137 --> 01:18:01,014
ఈ ప్రపంచంలో

1128
01:18:01,098 --> 01:18:06,311
నాకు దాని కన్నా విలువైనది మరొకటి లేదు."

1129
01:18:07,771 --> 01:18:08,772
సరేమరి.

1130
01:18:08,856 --> 01:18:10,858
నువ్వు చేయాల్సిందల్లా
ఇక్కడ నీ సంతకం పెట్టడమే.

1131
01:18:16,822 --> 01:18:18,448
ఇక దాన్ని అలాగే పంపించేయవచ్చు.

1132
01:18:32,254 --> 01:18:33,463
హేయ్, శ్యామీ.

1133
01:18:35,966 --> 01:18:37,759
హాయ్, బంగారం.

1134
01:18:40,596 --> 01:18:43,307
వచ్చి మీ అమ్మను హత్తుకోవా? రా.

1135
01:18:43,849 --> 01:18:44,933
హేయ్, అమ్మా.

1136
01:18:47,311 --> 01:18:50,147
అయ్యో. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను.

1137
01:18:51,481 --> 01:18:54,526
చూడు ఎలా ఉన్నావో. హాయ్.

1138
01:18:54,610 --> 01:18:57,070
-నువ్వు బాగానే ఉన్నావా?
-బాగానే ఉన్నా.

1139
01:18:57,154 --> 01:18:58,405
నేను బాగానే ఉన్నాను.

1140
01:19:01,491 --> 01:19:03,285
నేను మిస్ వివియన్ గురించి విన్నాను.

1141
01:19:04,203 --> 01:19:05,746
నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

1142
01:19:07,915 --> 01:19:09,750
తను చాలా మంచి వ్యక్తి. నాకు తను నచ్చేది.

1143
01:19:12,753 --> 01:19:15,172
శ్యామీ, ఇక మనం మన ఇంటికి వెళ్ళాలి, బంగారం.

1144
01:19:15,255 --> 01:19:16,673
నీ సామాను అంతా తెచ్చుకుంటావా?

1145
01:19:17,466 --> 01:19:19,593
-ఇంటికా?
-అవును.

1146
01:19:26,016 --> 01:19:28,393
-దీన్ని మర్చిపోకు.
-అస్సలు మర్చిపోను.

1147
01:19:30,896 --> 01:19:31,939
హేయ్.

1148
01:19:32,981 --> 01:19:34,149
గడిపినన్నాళ్ళూ చాలా సరదాగా గడిపాం.

1149
01:19:35,150 --> 01:19:38,737
నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు
నన్ను చూడటానికి రావచ్చు.

1150
01:19:48,872 --> 01:19:49,873
సరే అయితే.

1151
01:19:50,707 --> 01:19:52,626
నేను వెళ్లి నీ మిగతా సామాను తెస్తాను.

1152
01:19:52,709 --> 01:19:53,836
ధన్యవాదాలు, పామర్.

1153
01:19:55,504 --> 01:19:56,588
అది నీకు ఎక్కడిది?

1154
01:19:57,256 --> 01:19:58,382
అది నీది కాదు.

1155
01:19:59,800 --> 01:20:02,135
నా పుట్టినరోజు కోసం పామర్ కొనిచ్చాడు.

1156
01:20:03,303 --> 01:20:04,888
హేయ్. ఓ విషయం చెప్పనా?

1157
01:20:06,056 --> 01:20:08,684
నేను నీకు ఒక అత్యుత్తమ కానుకని తెచ్చాను.

1158
01:20:09,268 --> 01:20:10,811
అది ప్రపంచంలోనే చాలా అద్భుతమైన కానుక.

1159
01:20:11,395 --> 01:20:15,357
దాన్ని తేవడానికి నేను చాలా దూరం వెళ్ళాల్సి
వచ్చింది. చాలా చాలా దూరం అన్నమాట.

1160
01:20:15,440 --> 01:20:17,192
నీ కోసం నేను హరివిల్లు వెంట పడ్డాను.

1161
01:20:18,485 --> 01:20:19,945
-నిజంగానా?
-అవును.

1162
01:20:20,028 --> 01:20:21,363
అది చాలా బాగుంది.

1163
01:20:22,656 --> 01:20:24,032
అది నీకు ఇవ్వాలని నాకు ఎంతగానో ఉంది.

1164
01:20:24,116 --> 01:20:25,325
సరేమరి, బుడ్డోడా.

1165
01:20:25,701 --> 01:20:29,746
వావ్. నీ సామాను అంతా తెచ్చేసుకున్నావే
ఇక్కడికి?

1166
01:20:29,830 --> 01:20:32,499
-నువ్వు వెళ్లి చాలా రోజులయింది మరి.
-అవును.

1167
01:20:34,084 --> 01:20:35,169
ఇక వెళ్దాం పద.

1168
01:20:37,796 --> 01:20:40,507
శ్యామ్, ఇక వెళ్దాం పద అన్నాను కదా. రా.

1169
01:20:41,633 --> 01:20:42,634
వెళ్లు.

1170
01:20:43,677 --> 01:20:47,014
ఇన్నాళ్లూ వీడిని చూసుకున్నందుకు థ్యాంక్స్.
వెళ్లి నీ కానుకను చూద్దాం పద. రా.

1171
01:20:47,097 --> 01:20:48,515
ఇంటికి వెళ్దాం పద.

1172
01:20:48,599 --> 01:20:50,267
నాకు స్నానం చేయాలనుంది.

1173
01:21:45,405 --> 01:21:46,615
హేయ్, శ్యామ్ బాగానే ఉన్నాడా?

1174
01:21:48,700 --> 01:21:49,910
షెల్లీ వచ్చేసింది.

1175
01:21:51,286 --> 01:21:52,371
అవునా?

1176
01:21:54,456 --> 01:21:56,208
తను అంత బాగా కూడా లేదు.

1177
01:21:57,167 --> 01:21:58,919
తన ఆరోగ్యం బాగాలేనట్టుగా అనిపించింది.

1178
01:21:59,962 --> 01:22:01,880
రేపు మళ్లీ నీ దగ్గరకే వచ్చేస్తాడులే.

1179
01:22:02,506 --> 01:22:03,674
నేను అదే ఆశిస్తున్నా.

1180
01:22:07,678 --> 01:22:09,096
-హేయ్...
-నేను...

1181
01:22:09,179 --> 01:22:11,640
-నేను నా వస్తువులు తెచ్చుకుంటా...
-పర్వాలేదు. అలాగే తెచ్చుకో.

1182
01:22:38,584 --> 01:22:39,585
హేయ్.

1183
01:22:40,711 --> 01:22:41,879
నీ లంచ్ బాక్స్ ఏది?

1184
01:22:43,589 --> 01:22:44,923
జెర్రీ పారేశాడు.

1185
01:22:47,009 --> 01:22:49,887
అవునా? ఎందుకు?

1186
01:22:50,804 --> 01:22:53,765
మా అమ్మ నన్ను ఒక గే గా పెంచుతోందట,

1187
01:22:53,849 --> 01:22:56,393
గే పిల్లాడితో అతను ఉండలేడట.

1188
01:22:59,563 --> 01:23:00,981
గే అంటే ఏంటి?

1189
01:23:03,150 --> 01:23:05,485
అంటే నువ్వు విభిన్నమైన వాడివి అని
కొందరు అనుకుంటుంటారు.

1190
01:23:06,528 --> 01:23:07,696
నువ్వు కూడా గే నా?

1191
01:23:08,780 --> 01:23:10,991
నేను అందరిలా కాదు. అది మాత్రం చెప్పగలను.

1192
01:23:14,578 --> 01:23:15,579
హేయ్.

1193
01:23:16,288 --> 01:23:17,873
ఇంకా మనం ఎలాంటి వాళ్లమో చెప్పనా?

1194
01:23:19,666 --> 01:23:20,834
అందంగా ఉంటాం.

1195
01:23:22,377 --> 01:23:25,214
లేదు, నవ్వకు. మనిద్దరం అందగాళ్ళం.

1196
01:23:25,297 --> 01:23:27,549
అది జనాలకు నచ్చదు.
దాన్ని చూసి వాళ్లకు భయం కలుగుతుంది.

1197
01:23:29,968 --> 01:23:32,179
అదీగాక మల్లెట్ ఉండే మగాడిని
ఎప్పటికీ నమ్మకూడదు.

1198
01:23:32,888 --> 01:23:34,223
మల్లెట్ అంటే ఏంటి?

1199
01:23:34,306 --> 01:23:37,309
అది జుట్టు వెనుక పొడవుగా ఉండి భయంకరంగా
ఉంటుందిలే. పద, నిన్ను బడిలో దింపుతాను.

1200
01:23:37,935 --> 01:23:39,019
ధన్యవాదాలు, పామర్.

1201
01:23:39,603 --> 01:23:42,314
హేయ్, బడి అయ్యాక రూట్ బీర్ ఫ్లోట్
తాగడానికి వెళ్దామా?

1202
01:23:42,397 --> 01:23:44,983
నాకు కుదరదు. నేను మా అమ్మకు సాయపడాలి.

1203
01:23:45,442 --> 01:23:48,237
-ఎందుకు?
-ఎందుకంటే మేము జెర్రీ ఇంటికి వెళ్తున్నాం.

1204
01:23:48,320 --> 01:23:50,739
ఇక నేను వేరే బడికి వెళ్తాను.

1205
01:23:53,283 --> 01:23:55,953
అయితే నేను అప్పుడప్పుడూ వచ్చి
నిన్ను చూడాలి అనుకుంటా.

1206
01:23:56,036 --> 01:23:57,037
నిజంగా?

1207
01:23:57,955 --> 01:23:59,373
మాట ఇస్తున్నాను, బుల్లోడా.

1208
01:24:19,935 --> 01:24:23,605
వెళ్దాం పదండి. దేవుడా. తల్లిలాగే
కూతురు కూడా. మీరిద్దరూ మామూలోళ్లు కాదు.

1209
01:24:23,689 --> 01:24:24,773
అవును.

1210
01:24:25,691 --> 01:24:27,734
నీ గొణుగుడు బాగానే ఉందిలే.

1211
01:24:27,818 --> 01:24:30,195
ఎప్పుడూ కంగారుపెడుతూనే ఉంటావు!
అలా నన్ను కంగారు పెట్టకు!

1212
01:24:58,974 --> 01:25:00,851
...నన్ను తాకితే అయిపోతావు!

1213
01:25:00,934 --> 01:25:02,186
నన్ను ముట్టుకోకు!

1214
01:25:02,269 --> 01:25:04,813
కాస్త శాంతిస్తావా. ఇది నా తప్పు కాదు.

1215
01:25:04,897 --> 01:25:07,649
-నా దగ్గరకు రాకు.
-పైకి వెళ్తూ వింటున్నాను, అంతే.

1216
01:25:07,733 --> 01:25:09,193
-హేయ్.
-ఇది మొదటిసారి కాదు కదా.

1217
01:25:09,276 --> 01:25:10,777
హేయ్.

1218
01:25:10,861 --> 01:25:11,862
ఏంటది?

1219
01:25:13,405 --> 01:25:15,365
అసలేం జరుగుతోంది? శ్యామ్ ఎక్కడ?

1220
01:25:17,534 --> 01:25:20,204
-వాడు ఎక్కడ ఉన్నాడు?
-వెళ్లిపోయాడు. ఇక్కడ లేడు.

1221
01:25:23,373 --> 01:25:27,628
ఆ చెత్త పోలీసులు, శిశు సంక్షేమ శాఖ వాళ్ళు
వాడిని తీసుకెళ్లిపోయారు.

1222
01:25:35,010 --> 01:25:36,929
నువ్వు మహామాతవి.

1223
01:25:41,058 --> 01:25:42,851
వైద్య మరియు సేవల శాఖ
చిన్నారుల విభాగం

1224
01:25:42,935 --> 01:25:45,604
సోమవారం అతని అమ్మతో కుటుంబ కోర్టులో
ఒక కేసు విచారణ జరగనుంది.

1225
01:25:45,687 --> 01:25:47,898
శ్యామ్ ని దత్తత కేంద్రంలో ఉంచాలా,
లేక వాడి అమ్మతో ఉంచాలా అని

1226
01:25:47,981 --> 01:25:49,274
జడ్చి తీర్పు చెప్పనున్నారు.

1227
01:25:50,651 --> 01:25:54,655
సాధారణంగా అయితే తాత్కాలిక కస్టడీకి
మేము బంధువుల కోసం చూస్తాం.

1228
01:25:54,738 --> 01:25:56,532
మీరు ఈ పేపర్ వర్క్ ని పూర్తి చేయండి.

1229
01:25:57,908 --> 01:25:59,785
నాకు నేర చరిత్ర ఉంది.

1230
01:26:00,536 --> 01:26:02,204
మీరు ప్రస్తుతం పూచికత్తు మీద విడుదలయ్యారా?

1231
01:26:03,580 --> 01:26:07,960
మన్నించాలి. మీరు పూచీకత్తు మీద ఉంటే,
ఏజెన్సీ మీకు సంరక్షక లైసెన్స్ ని ఇవ్వలేదు.

1232
01:26:11,004 --> 01:26:12,005
నేను అతడిని చూడవచ్చా?

1233
01:26:12,089 --> 01:26:14,258
-లేదు.
-వాడు బిక్కుబిక్కుమంటూ ఉన్నాడేమో, మేడమ్.

1234
01:26:14,341 --> 01:26:16,885
-వాడికి ఆప్తులైన వారిని ఎవరినైనా చూస్తే...
-సర్, నేను అర్థం చేసుకోగలను.

1235
01:26:16,969 --> 01:26:20,848
కానీ మీరు తండ్రి, కుటుంబ సభ్యుడు, లేదా
చట్టబద్ధమైన సంరక్షకుడు అయితేనే చూడగలరు.

1236
01:26:23,058 --> 01:26:25,602
జడ్జిగారు మినహాయింపు ఇచ్చే అవకాశముంది.

1237
01:26:26,103 --> 01:26:27,771
కానీ అది జరగకపోవచ్చు.

1238
01:26:32,818 --> 01:26:33,986
ఏం కావాలి నీకు?

1239
01:26:35,529 --> 01:26:36,655
జెర్రీ ఎక్కడ?

1240
01:26:38,156 --> 01:26:39,658
ఏమో. నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్ళాడో.

1241
01:26:41,201 --> 01:26:44,079
హేయ్, నీ దగ్గర సిగరెట్ ఏమైనా ఉందా?

1242
01:26:49,751 --> 01:26:50,752
ధన్యవాదాలు.

1243
01:27:00,304 --> 01:27:01,805
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?

1244
01:27:06,226 --> 01:27:07,352
ఏంటిది?

1245
01:27:16,195 --> 01:27:17,821
చట్టబద్ధమైన సంరక్షణా?

1246
01:27:18,405 --> 01:27:20,532
శ్యామ్ నా సంరక్షణలో ఉంటాడని
నువ్వు సంతకం చేయాలి.

1247
01:27:23,785 --> 01:27:25,287
ఆ పని నేనెందుకు చేస్తాను?

1248
01:27:25,370 --> 01:27:28,665
ఎందుకంటే, నువ్వు మత్తుపదార్థాలకు దూరంగా
ఉంటేనే, కోర్టులు నీకు వాడిని అప్పగిస్తాయి.

1249
01:27:30,167 --> 01:27:32,002
నువ్వు నా ఇంటి నుండి బయటకు వెళ్లిపో.

1250
01:27:32,628 --> 01:27:33,754
తీసుకో.

1251
01:27:45,349 --> 01:27:47,559
నా కొడుకును కొనగలవు అనుకుంటున్నావా?

1252
01:27:47,643 --> 01:27:48,852
లేదు.

1253
01:27:50,771 --> 01:27:53,106
-నువ్వు నా కంటే తోపు అనుకుంటున్నావా?
-లేదు.

1254
01:27:53,190 --> 01:27:54,399
నువ్వు అనుకుంటున్నావులే.

1255
01:27:55,234 --> 01:27:57,569
నాతో పడకను పంచుకున్నావు కాబట్టి...

1256
01:27:58,779 --> 01:28:00,322
వాడి తండ్రివి అయిపోయావు అనుకుంటున్నావా?

1257
01:28:03,116 --> 01:28:04,660
నువ్వు వాడి తండ్రివి కాదు.

1258
01:28:05,285 --> 01:28:07,246
నువ్వు నా కన్నా తోపువి కూడా కాదు.

1259
01:28:07,329 --> 01:28:09,540
-నాకు ఈ డబ్బు అక్కర్లేదు.
-నీ కంటే నేను తోపు అని నేననుకోవడం లేదు.

1260
01:28:09,623 --> 01:28:12,042
-అవునులే.
-నీ కంటే నేను తోపు అని నేననుకోవడం లేదు.

1261
01:28:12,709 --> 01:28:15,170
ఈ సారి కాస్త అదృష్టం కలిసి వచ్చిందేమో.

1262
01:28:15,254 --> 01:28:17,297
కానీ నీకేమైనా జరిగితే...

1263
01:28:18,507 --> 01:28:21,176
వాళ్ళు శ్యామ్ ని తీసుకెళ్లిపోయి
వాళ్లకి ఇష్టమొచ్చిన చోట పెడతారు.

1264
01:28:22,386 --> 01:28:23,762
-లేదు.
-అదీగాక, మనిద్దరికీ తెలుసు...

1265
01:28:23,846 --> 01:28:26,557
-లేదు.
-...వాడు ఇతర అబ్బాయిలలా కాదు అని.

1266
01:28:27,474 --> 01:28:29,643
వాళ్లు శ్యామీని నాకు ఇచ్చేస్తారు.

1267
01:28:31,228 --> 01:28:34,189
శ్యామీ, నేనూ, మేమిద్దరం బాగానే ఉంటాం.
అర్థమైందా?

1268
01:28:34,273 --> 01:28:38,735
మేము ఈ చెత్త ఊరి నుండి వెళ్లిపోతాం,
ఇక నేను మత్తుపదార్థాల జోలికే వెళ్లను.

1269
01:28:38,819 --> 01:28:40,821
ఆ పని నేను చేసి తీరుతాను.

1270
01:28:41,780 --> 01:28:44,157
హేయ్! నేను మాకో పెద్ద ఇంటిని కొంటాను.

1271
01:28:44,616 --> 01:28:48,662
నేను నీకు నిరూపిస్తాను, నువ్వే చూస్తావు,
నేను అది చేయగలనని.

1272
01:28:48,745 --> 01:28:49,913
నేను...

1273
01:28:50,706 --> 01:28:52,791
-దయచేసి డబ్బును తీసుకో.
-వద్దు.

1274
01:28:53,250 --> 01:28:55,711
-షెల్లీ, నా మాట విను.
-నా వంక అలా చూడకు.

1275
01:28:55,794 --> 01:28:57,045
-దయచేసి తీసుకో.
-వద్దు.

1276
01:28:57,129 --> 01:28:58,505
నన్ను అలా చూడకు.

1277
01:28:59,006 --> 01:29:00,591
నన్ను చూడకు!

1278
01:29:02,718 --> 01:29:03,802
నా ఇంటిని నుండి వెళ్లిపో.

1279
01:29:05,762 --> 01:29:07,181
నా ఇంటిని నుండి వెళ్లిపో!

1280
01:29:09,516 --> 01:29:12,519
నా ఇంటిని నుండి బయటకు వెళ్లిపో!

1281
01:29:29,411 --> 01:29:31,496
నేను ఇలా చెప్పాపెట్టకుండా
వచ్చినందుకు మన్నించు.

1282
01:29:40,714 --> 01:29:42,716
మిస్టర్ పామర్, నాతో రండి.

1283
01:29:50,516 --> 01:29:55,312
మిస్టర్ పామర్, మీరు సన్మార్గంలోనే
వెళ్తున్నట్టున్నారు, మంచిగా ఉంటున్నారు.

1284
01:29:55,896 --> 01:29:59,816
ఇక బహుశా, ఒకసారి మీ జీవనం స్థిరపడి,

1285
01:29:59,900 --> 01:30:01,944
మీరు పూచికత్తు నుండి విముక్తులు అయితే...

1286
01:30:03,028 --> 01:30:05,197
అప్పుడు మీరు మళ్లీ లైసెన్స్
కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

1287
01:30:05,280 --> 01:30:06,281
ప్లీజ్.

1288
01:30:07,115 --> 01:30:09,117
నా కుర్రతనంలో నేను ఏదో పని చేసేశాను,

1289
01:30:09,868 --> 01:30:12,788
దానికి శిక్ష కూడా అనుభవించాను, కనుక
నేనెవ్వరినీ నిందించడం లేదు, యువర్ హానర్.

1290
01:30:13,622 --> 01:30:19,837
కానీ నిజమెమిటంటే, నేనొక పని మంచిగా చేయగలను
అని నాకు చాలా కాలం అనిపించనే లేదు...

1291
01:30:20,629 --> 01:30:21,630
శ్యామ్ వచ్చేంతవరకు.

1292
01:30:24,216 --> 01:30:28,512
అబ్బాయి ప్రభుత్వ సంరక్షణలోనే ఉంటాడని
నేను తీర్పు ఇస్తున్నాను.

1293
01:30:28,595 --> 01:30:30,722
అతని తల్లి మళ్లీ వాడిని చూసుకోగలిగే
స్థితికి వచ్చే దాకా

1294
01:30:30,806 --> 01:30:34,184
అతను ఒక రిజిస్టర్ అయిన
దత్తత కేంద్రంలో ఉంటాడు.

1295
01:30:34,268 --> 01:30:36,770
యువర్ హానర్, తను మత్తు పదార్థాలకి బానిస.
అది జరగని సంగతి.

1296
01:30:36,854 --> 01:30:38,230
కానీ, ప్రస్తుతానికి, నన్ను మన్నించాలి.

1297
01:30:38,313 --> 01:30:41,275
తాత్కాలిక కస్టడీ కోసం మీరు పెట్టుకొన్న
అర్జీని నేను తిరస్కరించాల్సి వచ్చింది.

1298
01:30:41,358 --> 01:30:42,776
ఇలా చేయకండి.

1299
01:30:42,860 --> 01:30:45,863
ఒంటరిగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు.

1300
01:30:47,322 --> 01:30:48,615
నేను వాడిని వదిలేయలేను.

1301
01:30:48,699 --> 01:30:50,868
నేను వాడిని వదిలిపెట్టను కూడా.

1302
01:30:53,453 --> 01:30:54,663
నేను మీకు మాటిస్తున్నాను...

1303
01:30:55,789 --> 01:30:57,875
శ్యామ్ గురించి ఇక ఎవ్వరూ కూడా
ఆందోళన పడాల్సిన పని లేదు.

1304
01:30:57,958 --> 01:30:59,668
నేను వాడిని బాగా చూసుకుంటాను.

1305
01:31:00,752 --> 01:31:02,004
చాలా బాగా చూసుకుంటాను.

1306
01:31:03,255 --> 01:31:05,257
మన్నించాలి. ఇదే నా ఆఖరి నిర్ణయం.

1307
01:31:11,722 --> 01:31:12,806
ఒక్క నిమిషం, మేడమ్.

1308
01:31:12,890 --> 01:31:15,475
-నేను ఇక్కడికి రావాల్సి ఉంది. వచ్చేశాను.
-మీరు లోపలికి వెళ్లకూడదు.

1309
01:31:15,559 --> 01:31:18,395
సర్, నన్ను వదిలేయండి. నేను వచ్చేశాను.

1310
01:31:18,478 --> 01:31:20,981
-ఆలస్యమైనందుకు మన్నించండి.
-మన్నించండి, యువర్ హానర్.

1311
01:31:21,064 --> 01:31:23,192
-ఇతనికి ఇక్కడేం పని?
-ఏమంటున్నారు?

1312
01:31:23,275 --> 01:31:24,443
నేను శ్యామ్ తల్లిని.

1313
01:31:24,526 --> 01:31:27,446
-బెంచ్ దగ్గరకు దయచేసి రాకండి.
-మేడమ్... మన్నించండి, మేడమ్, సరే.

1314
01:31:29,364 --> 01:31:32,242
యువర్ హానర్, ఆలస్యమైనందుకు మన్నించండి.
కానీ నేను వచ్చేశాను.

1315
01:31:33,202 --> 01:31:36,747
మేడమ్, ఆ పోలీసులు, వాళ్లు
శ్యామ్ తో కనీసం మాట్లాడలేదు కూడా, సరేనా?

1316
01:31:36,830 --> 01:31:39,333
నా ఇంట్లోకి వచ్చేసి,
నా కొడుకుని తీసుకెళ్లిపోయారు.

1317
01:31:39,416 --> 01:31:40,918
ఎందుకని కూడా చెప్పలేదు.

1318
01:31:41,001 --> 01:31:44,963
మిస్ బర్డెట్, మీ మీద హింస మరియు
పట్టించుకోవడం లేదని

1319
01:31:45,047 --> 01:31:46,673
శిశు సంక్షేమ శాఖకి ఫిర్యాదు అందింది.

1320
01:31:46,757 --> 01:31:50,010
మీరు హింసాత్మకంగా, చిరాకుగా
ప్రవర్తిస్తారని పేర్కొన్నారు.

1321
01:31:50,093 --> 01:31:52,513
అది నిజం కాదు. మేడమ్, అది నిజం కాదు.

1322
01:31:54,890 --> 01:31:58,393
అవును, చికాకుగా ఉండేదాన్ని.
దాన్ని నేను ఒప్పుకుంటాను.

1323
01:31:59,478 --> 01:32:01,897
ఇటీవల నాకు కొన్ని
ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి.

1324
01:32:01,980 --> 01:32:04,066
నేనేమీ కాదని చెప్పడం లేదు.

1325
01:32:05,192 --> 01:32:09,071
చూడండి, మీ దగ్గర ఉన్న చీటీలో ఏముందో,
ఇతనేం చెప్పాడో, అవేమీ నాకు తెలియవు.

1326
01:32:09,571 --> 01:32:12,074
కానీ నా కొడుకు పైకి
నేనెప్పుడూ చేయి ఎత్తలేదు.

1327
01:32:12,950 --> 01:32:15,202
ఇప్పటిదాకా కనీసం
వాడిని నేను అరవను కూడా లేదు.

1328
01:32:15,285 --> 01:32:16,745
మేడమ్, వాడేమీ ఆనందం దూరమై లేడు.

1329
01:32:16,828 --> 01:32:18,956
-మిస్ బర్డెట్, నేను అర్థం చేసుకోగలను.
-మీరేం చేయమన్నా చేస్తా.

1330
01:32:19,039 --> 01:32:21,583
ఏంటి? నాకు మూత్ర పరీక్ష చేస్తారా?
ఏం ఫర్వాలేదు. పరీక్ష చేయండి.

1331
01:32:23,168 --> 01:32:24,545
మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను.

1332
01:32:24,628 --> 01:32:27,381
దయచేసి నా కొడుకును ఎవరో అనామకులతో
ఉండనివ్వకండి.

1333
01:32:31,134 --> 01:32:32,678
వాడు వాడి అమ్మ దగ్గర ఉండాలి.

1334
01:32:34,221 --> 01:32:35,347
మిమ్మల్ని వేడుకుంటున్నాను.

1335
01:33:08,922 --> 01:33:10,215
బాగానే ఉన్నావా?

1336
01:33:10,924 --> 01:33:11,925
శ్యామ్?

1337
01:33:12,634 --> 01:33:14,845
హేయ్, శ్యామీ. ఇటు రా, బంగారం.

1338
01:33:15,888 --> 01:33:18,765
హేయ్. కారులో పెట్టాల్సినవి
ఇంకా చాలా ఉన్నాయి. రా.

1339
01:33:25,272 --> 01:33:27,649
మీ పిచ్చితో నాకు విసుగొచ్చేసింది!

1340
01:33:27,733 --> 01:33:29,193
అయ్యబాబోయ్! మళ్లీ నువ్వేనా?

1341
01:33:29,276 --> 01:33:32,404
ఈ చెత్త పనులన్నీ మానేయమని
నీకు ఎన్ని సార్లు చెప్పాలి?

1342
01:33:32,487 --> 01:33:34,823
ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు!

1343
01:33:34,907 --> 01:33:37,201
ఈ చెత్త ట్రెయిలర్ ని నేను తగలబెట్టేస్తాను.

1344
01:33:37,284 --> 01:33:40,621
ఇక నువ్వూ, నీ గే కొడుకూ
ఇద్దరూ వీధిన పడతారు.

1345
01:33:40,704 --> 01:33:42,497
క్రిస్మస్ నాటికి వీడు మగవాళ్లతో
పడక పంచుకుంటాడు.

1346
01:33:42,581 --> 01:33:44,625
మీ పిచ్చిని భరించడం ఇక నా వల్ల కాదు.

1347
01:33:48,420 --> 01:33:51,006
తిరుగుబోతుదానా! కానివ్వు. ఆ మాట అనేయ్.

1348
01:33:51,089 --> 01:33:53,717
-అసలు నీకు ఏమైంది?
-అమ్మా!

1349
01:33:53,800 --> 01:33:55,260
మా అమ్మ మీద చేయి వేయకు!

1350
01:33:55,344 --> 01:33:56,512
-నన్ను వదులు!
-అమ్మా!

1351
01:33:56,595 --> 01:33:58,931
-ఈ పిల్లోడు ఒకడు నా మీద. పక్కకి పో.
-నా కొడుకుని దయచేసి ఏం చేయకు!

1352
01:33:59,014 --> 01:34:00,724
-నన్ను వదలరా దరిద్రుడా!
-ప్లీజ్!

1353
01:34:00,807 --> 01:34:02,434
నీకు కావలసింది అదేనా?
నేను ఎక్కడ పెడతానో...

1354
01:34:02,518 --> 01:34:04,311
-వద్దు! హేయ్!
-ఏంటి?

1355
01:34:05,729 --> 01:34:07,523
దేవుడా.

1356
01:34:07,606 --> 01:34:09,525
నువ్వు జెర్రీని గాల్లోకి ఎగిరేశావు.

1357
01:34:10,067 --> 01:34:11,860
అతను గాల్లోకి ఎగిరాడు.

1358
01:34:12,694 --> 01:34:14,988
అలా అతను ఎగరడం నేనెన్నడూ చూడలేదు.

1359
01:34:17,032 --> 01:34:19,409
-పద, శ్యామ్. పద.
-అతను ఎగిరాడు!

1360
01:34:19,952 --> 01:34:20,953
హేయ్.

1361
01:34:21,745 --> 01:34:23,705
హేయ్! నా కొడుకుని తీసుకొని
ఎక్కడికి వెళ్తున్నావు?

1362
01:34:24,206 --> 01:34:26,375
హేయ్! దరిద్రుడా!

1363
01:34:36,385 --> 01:34:39,346
హేయ్. ఏమీ ఫర్వాలేదు. సరేనా?

1364
01:34:39,972 --> 01:34:41,223
-అలాగే.
-సరేనా?

1365
01:34:41,306 --> 01:34:42,307
సరే.

1366
01:35:00,492 --> 01:35:02,077
ఇక్కడే ఉండు, శ్యామ్, సరేనా?

1367
01:35:06,832 --> 01:35:08,500
మీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా,
నేను ఒకరికి కాల్ చేయాలి.

1368
01:35:09,376 --> 01:35:10,377
ధన్యవాదాలు.

1369
01:35:18,635 --> 01:35:19,636
హలో?

1370
01:35:20,053 --> 01:35:21,096
నేనే.

1371
01:35:21,680 --> 01:35:24,016
-నేను శ్యామ్ ని తీసుకెళ్లిపోయాను.
-దేవుడా.

1372
01:35:24,099 --> 01:35:26,560
ఎడ్డీ, షెల్లీ పోలీసులకి కాల్ చేసింది.
వాళ్లు నీ కోసం వెతుకుతున్నారు.

1373
01:35:27,686 --> 01:35:28,937
నువ్వు అతడిని వెనక్కి తెచ్చేయాలి.

1374
01:35:29,021 --> 01:35:30,856
అది నా వల్ల కాదు. ఆ పని నేను చేయలేను.

1375
01:35:30,939 --> 01:35:33,192
-ఎడ్డీ, అది అపహరించడం అవుతుంది.
-తను సరైనది కాదు.

1376
01:35:33,275 --> 01:35:36,028
కావచ్చు, కానీ నువ్వు ఎక్కడికని వెళ్లగలవు?

1377
01:35:36,778 --> 01:35:39,281
మళ్లీ జైలుకు వెళ్ళాలనుందా?
నీకు కావలసింది అదేనా?

1378
01:35:40,782 --> 01:35:43,368
తను శ్యామ్ కన్న తల్లి, ఎడ్డీ.

1379
01:35:44,328 --> 01:35:47,956
మంచైనా చెడైనా, తప్పైనా ఒప్పైనా,
తను శ్యామ్ కన్న తల్లి.

1380
01:35:58,634 --> 01:35:59,718
కోల్స్ కి కాల్ చేయి.

1381
01:36:10,103 --> 01:36:11,355
మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం?

1382
01:36:36,004 --> 01:36:38,549
అంతా సర్దుకుంటుంది. సరేనా?

1383
01:36:43,887 --> 01:36:45,305
అడుగో నా కొడుకు! శ్యామీ!

1384
01:36:45,389 --> 01:36:48,100
-ఆగండి.
-వద్దు! హేయ్. శ్యామీ!

1385
01:36:48,183 --> 01:36:49,393
-దేవుడా.
-హేయ్, హేయ్.

1386
01:36:49,476 --> 01:36:51,728
నన్ను వదలండి! దేవుడా. వద్దు!

1387
01:36:51,812 --> 01:36:52,896
ఆమెని వదలకండి.

1388
01:36:53,647 --> 01:36:57,150
-ఇక మనం కారు దిగాలి. దిగు.
-శ్యామీ! బంగారం!

1389
01:36:57,234 --> 01:36:59,862
-ఆమెని కదలకుండా పట్టుకోండి.
-శ్యామీ! శ్యామీ!

1390
01:36:59,945 --> 01:37:02,281
-నేను మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాను.
-శాంతించాలి.

1391
01:37:02,364 --> 01:37:03,949
తనని నేల మీద పడుకోబెట్టి అలానే ఉంచండి.

1392
01:37:04,032 --> 01:37:05,200
-దేవుడా.
-శ్యామీ.

1393
01:37:05,284 --> 01:37:08,245
-శాంతంగానే ఉన్నా! శ్యామీ, అమ్మ వద్దకు రా.
-చూడు. తను శ్యామ్ ని చూసుకోలేదు.

1394
01:37:08,328 --> 01:37:10,747
-పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తోంది.
-దయచేస్, బంగారం, ఇక్కడికి రా.

1395
01:37:10,831 --> 01:37:12,249
అదీ.

1396
01:37:12,332 --> 01:37:14,543
శ్యామీని మ్యాగీ ఇంటికి తీసుకెళ్తాను.
ప్రస్తుతానికి వాడు అక్కడ ఉంటాడు.

1397
01:37:14,626 --> 01:37:16,128
-నా బంగారం.
-సరేనా?

1398
01:37:16,211 --> 01:37:18,797
నువ్వంటే నాకు ప్రాణం. హాయ్.
నీకు ఏమీ కాలేదు కదా?

1399
01:37:18,881 --> 01:37:21,842
అతను నిన్నేమైనా చేశాడా?
నీ గురించి చాలా కంగారుపడిపోయాను.

1400
01:37:21,925 --> 01:37:23,844
-నేను నిజంగా చింతిస్తున్నాను.
-వెనక్కి తిరుగు, ఎడ్డీ.

1401
01:37:23,927 --> 01:37:25,220
నువ్వు బాగానే ఉన్నావని చెప్పు.

1402
01:37:25,971 --> 01:37:27,389
చేతులు వెనక్కి పెట్టు.

1403
01:37:28,473 --> 01:37:30,809
నువ్వు తప్పుడు పనులు చేయకుండా ఉండలేవు కదా?

1404
01:37:31,977 --> 01:37:33,770
-అమ్మ నీ మీద బెంగ పెట్టేసుకుంది.
-పద.

1405
01:37:33,854 --> 01:37:36,231
హేయ్, బంగారం. నా వరాల మూట.

1406
01:37:36,315 --> 01:37:37,983
వాడిని దత్తత కేంద్రానికి పంపకుండా చూసుకో.

1407
01:37:38,066 --> 01:37:40,068
-ఫర్వాలేదులే.
-వద్దు!

1408
01:37:40,152 --> 01:37:41,737
ఆగు, శ్యామీ. శ్యామీ, ఆగు.

1409
01:37:41,820 --> 01:37:44,781
-అతడిని వదలండి!
-హేయ్, హేయ్. ఆగు, శ్యామీ.

1410
01:37:44,865 --> 01:37:46,658
-ఆగు. హేయ్. ఆగమన్నానా.
-నా కొడుకు మీద చేతులెయ్యవద్దు!

1411
01:37:46,742 --> 01:37:48,410
-నిన్ను తొందరపడి వదిలారని తెలుసు.
-వాడికి నొప్పి కలుగుతుంది.

1412
01:37:48,493 --> 01:37:50,120
-కమాన్, శ్యామీ.
-వద్దు, బంగారం!

1413
01:37:50,204 --> 01:37:52,706
-అతడిని వదిలేయండి!
-శ్యామీ.

1414
01:37:53,332 --> 01:37:54,917
హేయ్, బంగారం. ఐ లవ్ యూ.

1415
01:37:55,000 --> 01:37:57,294
నీకు నేనున్నాను. మీ అమ్మకు నువ్వంటే
ప్రాణం. నేను నిన్ను బాగా చూసుకుంటా.

1416
01:37:57,377 --> 01:37:59,838
-నువ్వు నన్నెప్పుడూ సరిగ్గా చూసుకోలేదు.
-ఐ లవ్ యూ. నిజంగానే.

1417
01:37:59,922 --> 01:38:02,674
-నువ్వు ఎప్పుడూ నన్ను చూసుకోలేదు.
-చూసుకున్నాను. నీకు నేనున్నాను, హనీ.

1418
01:38:02,758 --> 01:38:04,593
నన్ను వదులు!

1419
01:38:06,345 --> 01:38:07,804
పామర్!

1420
01:38:10,349 --> 01:38:11,892
పామర్!

1421
01:38:12,935 --> 01:38:14,311
మీ అమ్మ దగ్గరికి వెళ్లు, శ్యామ్.

1422
01:38:15,062 --> 01:38:17,105
పామర్!

1423
01:38:18,607 --> 01:38:20,442
-ఏం పర్వాలేదు.
-పామర్.

1424
01:38:21,026 --> 01:38:22,027
శ్యామ్.

1425
01:38:22,110 --> 01:38:23,612
పామర్!

1426
01:38:24,196 --> 01:38:25,572
పామర్!

1427
01:38:27,366 --> 01:38:28,617
పామర్!

1428
01:38:30,285 --> 01:38:31,703
పామర్!

1429
01:38:32,621 --> 01:38:34,831
పామర్!

1430
01:38:35,749 --> 01:38:37,292
పామర్!

1431
01:39:19,918 --> 01:39:21,253
నువ్వు ఇక బయటకు వెళ్లిపోవచ్చు.

1432
01:39:23,130 --> 01:39:27,050
నువ్వు శ్యామ్ ని కేవలం తినడానికి మాత్రమే
తీసుకెళ్ళావని షెల్లీ చెప్పింది.

1433
01:39:29,720 --> 01:39:31,471
అది గుర్తులేనంత మత్తు ఎక్కిపోయిందేమో తనకి.

1434
01:39:32,764 --> 01:39:34,850
కాబట్టి మేము నీ మీద ఆరోపణలని కొట్టేశాం.

1435
01:39:36,351 --> 01:39:38,145
శ్యామ్ ఇంకా మ్యాగీ దగ్గరే ఉన్నాడు.

1436
01:39:47,070 --> 01:39:48,071
హేయ్.

1437
01:39:50,616 --> 01:39:51,700
నీకు ఒకటి రుణం ఉన్నాను.

1438
01:39:53,243 --> 01:39:55,412
అవును. అది నిజం.

1439
01:40:22,022 --> 01:40:23,607
నేను తల్లిగా పనికిరాను అనుకుంటున్నావు కదా.

1440
01:40:36,495 --> 01:40:37,496
హేయ్, శ్యామీ.

1441
01:40:45,212 --> 01:40:46,213
హాయ్, బంగారం.

1442
01:41:01,770 --> 01:41:02,771
హేయ్.

1443
01:41:07,860 --> 01:41:09,528
నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు.

1444
01:41:11,280 --> 01:41:12,281
ఫర్వాలేదులే.

1445
01:41:13,907 --> 01:41:15,409
నాకు కూడా నా మీద కోపమే వస్తుంది.

1446
01:41:18,036 --> 01:41:22,291
నేను నీతో చాలా ముఖ్యమైన ఒక విషయం
గురించి మాట్లాడాలి.

1447
01:41:24,251 --> 01:41:25,961
మనం మాట్లాడుకుందామా?

1448
01:41:27,880 --> 01:41:29,423
సరే, నేను ఇక్కడ నీ దగ్గర కూర్చోవచ్చా?

1449
01:41:29,506 --> 01:41:30,549
కూర్చో, అమ్మా.

1450
01:41:31,884 --> 01:41:32,885
ధన్యవాదాలు.

1451
01:41:43,896 --> 01:41:46,231
నేను కొన్ని విషయాల గురించి
కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను

1452
01:41:50,485 --> 01:41:53,280
నువ్వు పామర్ వద్ద ఉండటమే మంచిది అనుకుంటా.

1453
01:41:56,700 --> 01:41:57,868
అతను మంచి వాడు.

1454
01:41:58,911 --> 01:42:00,829
నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.

1455
01:42:03,582 --> 01:42:04,583
ఇంకా...

1456
01:42:13,592 --> 01:42:15,969
నేను ఇబ్బందుల్లో ఉన్నాను.

1457
01:42:17,346 --> 01:42:20,098
బంగారం, ఇప్పుడు
నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.

1458
01:42:25,521 --> 01:42:26,605
కానీ...

1459
01:42:26,688 --> 01:42:28,440
నీ చేతులను ఇలా ఇవ్వు.

1460
01:42:30,692 --> 01:42:32,694
అంటే నీ మీద ప్రేమ లేదని కాదు.

1461
01:42:36,365 --> 01:42:38,408
నువ్వు నా ప్రాణం.

1462
01:42:43,914 --> 01:42:45,207
నువ్వేమనుకుంటున్నావు?

1463
01:42:50,796 --> 01:42:52,464
పామర్ తో ఉంటావా?

1464
01:42:54,299 --> 01:42:56,051
అతడు నీకు తండ్రి కావాలనుకుంటున్నావా?

1465
01:42:56,134 --> 01:42:58,387
-అవును.
-సరే.

1466
01:43:04,518 --> 01:43:06,520
వచ్చి నన్ను ఓసారి హత్తుకో.

1467
01:43:20,450 --> 01:43:21,577
సరేమరి.

1468
01:43:45,309 --> 01:43:46,643
నీకు కావలసినవన్నీ ఉన్నాయి కదా?

1469
01:43:46,727 --> 01:43:48,270
ఉన్నాయనే అనిపిస్తుంది.

1470
01:43:48,353 --> 01:43:51,190
మనం ఇవాళ రాత్రి మిస్ మ్యాగీతో కలిసి
డిన్నర్ చేయబోతున్నామా?

1471
01:43:51,273 --> 01:43:53,942
అవును. తను నీకు ఇష్టమైన
క్యాబేజీ చేస్తుంది.

1472
01:43:54,026 --> 01:43:55,277
క్యాబేజీనా?

1473
01:43:58,071 --> 01:44:00,741
ఫోర్బ్స్ ఎయిర్ కండిషనర్
బాగు అయిపోయింది. అతని గదిలో బిగించి వస్తా.

1474
01:44:02,451 --> 01:44:03,452
పామర్.

1475
01:44:05,454 --> 01:44:06,663
నేను నీకు ఒకటి ఇవ్వాలి.

1476
01:44:17,466 --> 01:44:18,675
నీ తాళం చెవులు.

1477
01:44:20,302 --> 01:44:22,012
నువ్వు వీటికి అన్నివిధాలా అర్హుడివి.

1478
01:44:27,976 --> 01:44:29,102
ధన్యవాదాలు, సిబ్స్.

1479
01:44:31,021 --> 01:44:33,440
జూనియర్ కి వేచి చూడటం ఇష్టముండదు.
ఇక బయలుదేరి పని చూడు.

1480
01:44:40,572 --> 01:44:42,741
-బై, శ్యామ్.
-బై, ఎమిలీ.

1481
01:44:43,617 --> 01:44:45,077
హేయ్, మన తర్వాతి టీ పార్టీ ఎప్పుడు?

1482
01:44:45,619 --> 01:44:47,454
నాకు తెలీదు. నువ్వే చెప్పాలి.

1483
01:44:48,747 --> 01:44:50,249
ఆ షెడ్యూల్ నాకు తెలీదు.

1484
01:44:56,713 --> 01:44:58,924
పద. మనం కొన్నింటిని తీసుకోవాలి.

1485
01:44:59,007 --> 01:45:00,425
అమ్ముడుపోయింది

1486
01:45:21,196 --> 01:45:23,407
హేయ్, శ్యామ్? ఇటు రా.

1487
01:45:27,911 --> 01:45:28,912
ఇది నీకే వచ్చింది.

1488
01:45:28,996 --> 01:45:30,622
శ్యామ్ బర్డెట్

1489
01:45:32,583 --> 01:45:34,501
ఇది వరకు ఎన్నడూ నాకు పోస్ట్ రాలేదు.

1490
01:45:34,585 --> 01:45:36,128
తెరిచి, అందులో ఏముందో చూడు.

1491
01:45:46,221 --> 01:45:48,140
పెనెలోపి యొక్క ఎగిరే యువరాణుల క్లబ్ కి
సుస్వాగతం

1492
01:45:53,770 --> 01:45:55,606
ఇటు చూడు. ఇక్కడ బంగారు నక్షత్రం ఉంది.

1493
01:45:55,689 --> 01:45:58,317
నా పేరు చూడు. ఇక్కడే రాసుంది.
శ్యామ్ బర్డెట్, ఇంకా...

1494
01:45:58,400 --> 01:46:00,319
అవును, అవును.

1495
01:46:04,740 --> 01:46:05,949
హేయ్.

1496
01:46:06,033 --> 01:46:07,159
అభినందనలు.

1497
01:46:25,928 --> 01:46:31,558
శుభం

1498
01:50:51,485 --> 01:50:53,487
ఉపశీర్షికలను అనువదించినది: రాంప్రసాద్

